Typhoon Michong : ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాన్.. అప్రమత్తమైన ఏపీ సర్కార్
నైరుతి బంగాళాఖాతంలో(Bay Of Bengal) ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ మిచాంగ్ తుఫాన్‌గా(Typhoon Michong) బలపడనుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తుఫాన్‌గా మారిన తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది. ఈ తుపాను పుదుచ్చేరికి 440 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి(chennai) 420 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు 520 కిలోమీటర్ల దూరంలో, బాపట్లకు 620 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
నైరుతి బంగాళాఖాతంలో(Bay Of Bengal) ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ మిచాంగ్ తుఫాన్‌గా(Typhoon Michong) బలపడనుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తుఫాన్‌గా మారిన తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది. ఈ తుపాను పుదుచ్చేరికి 440 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి(chennai) 420 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు 520 కిలోమీటర్ల దూరంలో, బాపట్లకు 620 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం రాత్రికి ఇది తుపానుగా మారే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. రేపటికి ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు విస్తరించనుంది. ఆ తర్వాత దక్షిణాంధ్ర తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణిస్తూ 5వ తేదీ ఉదయం బాపట్ల(Baptla)–మచిలీపట్నం(Machilipatna) మధ్య తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం సమీపంలో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని వాతావరణశాఖ చెబుతోంది. మరోవైపు తుఫాన్ తీరం దాటుతుందా.. లేకపోతే మచిలీపట్నం సమీపంలోనే తీరం వరకు వచ్చి మళ్లీ సముద్రంలోనే దిశ మార్చుకుంటుందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సముద్రంలో ఉష్ణోగ్రతలు, భూమి మీద ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతలను బట్టి ఈ సందేహాలు వస్తున్నాయి. ఒకవేళ తీరం దాటితే తుఫాన్ బలహీనపడి మళ్లీ కోనసీమ ప్రాంతంలో మళ్లీ సముద్రంలోకి వెళ్లే అవకాశాలున్నాయి.
తుఫాన్ ప్రభావంతో ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో(Rayalaseema) భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 75 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
పలు ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. తుఫాన్ తీరం వైపు దూసుకొస్తుండడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చాలాచోట్ల దాదాపు యాభై మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. మిచాంగ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) కోస్తా ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉండటంతో రైల్వే అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
తుపాను నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే(Railway) సీపీఆర్వో సీహెచ్ రాకేశ్(Rakesh) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి బయల్దేరే రైళ్లలో హైదరాబాద్–తాంబరం(చెన్నై), సికింద్రాబాద్–కొల్లాం, సికింద్రాబాద్–తిరుపతి, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–రేపల్లె, కాచిగూడ–రేపల్లె, చెన్నై–హైదరాబాద్, సికింద్రాబాద్–గూడూరు, సికింద్రాబాద్–త్రివేండ్రం తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి.