Heavy rains in AP : ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు
దక్షిణ ఒడిశా(Odisha) పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. మరోవైపు దక్షిణ ఒడిశా మీదుగా ద్రోణి విస్తరించినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో రుతుపవన ద్రోణి కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించినట్లు పేర్కొన్నారు. దీంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో.. కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నారయని వాతావరణ శాఖ వెల్లడించింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఇవాళ సాయంత్రంలోగా అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులూ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మంగళ, బుధవారాలు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా మారి తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతవరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకు చేపలవేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం పేర్కొంది.