Telangana Weather : తరుముకొస్తున్న మిగ్‌జాం తుఫాన్...తెలుగు రాష్ట్రాలలో అతి భారీ వర్షాలు
మిగ్‌జాం తుఫాన్(Migzam typhoon) ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు(Nellore) 20 కిలోమీటర్లు, బాపట్లకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు(Heavy Rain) కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలలో గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
మిగ్‌జాం తుఫాన్(Migzam typhoon) ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు(Nellore) 20 కిలోమీటర్లు, బాపట్లకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు(Heavy Rain) కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలలో గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుఫాన్ కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో(Telangana) కూడా మంగళ, బుధవారాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మిగ్‌జాం ప్రభావం ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఉండనుంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం(Kotha gudem), ఖమ్మం జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయ. సూర్యాపేట, మహబూబాబద్, వరంగల్, హనుమకొండలలో అతిభారీ వర్షాలు పడతాయి. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 6వ తేదీ కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, భువనగిరి, భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌లలో భారీ వర్షాలుకురవచ్చు. ఉత్తర తెలంగాణజిల్లాల్లో, హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు ఉండొచ్చని వాతావరణశాఖ వివరించింది. తుఫాన్ ఎఫెక్ట్ రైళ్ల రాకపోకలపై పడింది. హైదరాబాద్ నుంచి దక్షిణాదికి రైళ్లు నిలిచిపోయాయి. ఉత్తరాది నుంచి వచ్చే వాటికి బ్రేక్ పడింది. ఇప్పటికే 150కిపైగా రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.