వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(Ysrcp)నాయకుడు కుక్కల విద్యాసాగర్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌(FIR) నమోదు చేశారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(Ysrcp)నాయకుడు కుక్కల విద్యాసాగర్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌(FIR) నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేశారంటూ తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలసి ముంబాయి నటి కాదంబరి జత్వానీ(kadambari jethwani)పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కుక్కల విద్యాసాగర్‌(Kukkala Vidya Sagar),మరికొందరిపై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్‌విత్‌ 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాదంబరి జత్వానీ ఇవాళ కూడా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌(ibrahimpatnam police)కు వెళ్లారు. కేసుకు సంబంధించిన వివరాలు అందజేశారు. మరోవైపు జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడ(Vijayawada)లో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు(ACP Hanumantharao), నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఇక ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఐపీఎస్‌లు పి.సీతారామాంజనేయులు(Seetharamanjaneyulu), కాంతిరాణా తాతా(Kantirana Tatha), విశాల్‌ గున్నీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది.

ehatv

ehatv

Next Story