ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ను నియమించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ను నియమించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ ఈనెల 31తో ముగియనుండడంతో నూత‌న సీఎస్‌గా విజ‌యానంద్‌ను ప్రభుత్వం నియమించింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున పదవీ విజయానంద్‌ పదవీ విరమణ చేయనున్నారు. కాగా, విజయానంద్ ఇంత‌కుముందు 2022లో ఏపీ జెన్ కో ఛైర్మన్‌గా ఉన్నారు. 2023లో ఏపీ ట్రాన్స్ కోకు సీఎండీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

ehatv

ehatv

Next Story