Andhrapradesh CS: ఏపీ సీఎస్ గా నీరబ్ కుమార్?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. 1987 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబును నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఆయన నియామకంపై జీవో రావొచ్చనే చర్చ నడిచింది.
అనుకున్నట్లుగానే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆయన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తాజాగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతుండడంతో సీఎంఓ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు.