ఆమ్రాపాలి(Amrapali) ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) వెళ్లాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది.
ఆమ్రాపాలి(Amrapali) ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) వెళ్లాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది. ఆమ్రాపాలి, రొనాల్డ్ రోస్(Ronald ross), వాకాటి కరుణ సహా పలువురు ఐఏఎస్‌లు వేసిన పిటిషన్‌పై అటు క్యాట్‌లో, ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ఏపీలో రిపోర్టు చేయాలంటూ హైకోర్టు(High court) ఆదేశాలిచ్చింది. అటు క్యాట్‌లో కూడా ఐఏఎస్‌లకు అక్షింతలు పడడంతో వారు తెలంగాణను వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమ్రాపాలి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. మూసి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా కూడా కీలక బాధ్యతలు పర్యవేక్షించారు. తనదైన శైలిలో పనిచేస్తూ ఆమ్రాపాలి గత కొన్నినెలలుగా అందరి మన్ననలు పొందారు. అయితే ఆమ్రాపాలిని స్వరాష్ట్రంలో పోస్టింగ్‌కు ఆదేశాలు రావడంతో ఆమె అక్కడ కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్(Pawan kalyan) పేషీలోకి ఈ యువ ఐఏఎస్ వెళ్తారని సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆమ్రాపాలికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారోనని రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.