వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (YSRCP)పార్టీకి గత ఎన్నికల వరకు సేవలందించిన ఐప్యాక్(I Pac) మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (YSRCP)పార్టీకి గత ఎన్నికల వరకు సేవలందించిన ఐప్యాక్(I Pac) మళ్లీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అడపాదడపా పనులు చేస్తున్న వైసీపీ ఇక నుంచి పూర్తిగా వైసీపీ కోసం పనిచేయనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఐప్యాక్‌ను నమ్ముకొని వైసీపీ బోర్లాపడిందన్న వార్తలతో జగన్(YS Jagan) కొంత అప్‌సెట్‌గా ఉన్నారని.. ఇక ఐప్యాక్ టీం ఇటు రాకపోవచ్చని అంతా అనుకున్నారు. త్వరలోనే ఐప్యాక్ టీం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనుంది. అయితే తాను అధికారంలో ఉండగా జగన్ పార్టీని పట్టించుకోలేదని వాలంటీర్ల(Volunteers) ద్వారా ప్రభుత్వాన్ని నడపారని దీంతోనే పార్టీని పట్టించుకునేవారే లేకపోయారని కార్యకర్తలు వాపోయారు. జగన్ అనకున్నవేవీ ఎన్నికల్లో పని చేయలేదు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని చంద్రబాబు(Chandrababu) ఉగాది పర్వదినం నాడు ప్రకటించారు. దీంతో వాలంటీర్లలో కొందరు టీడీపీకి(TDP) వెళ్లారని తెలిసింది.
ప్రభుత్వం మారిన తర్వాత వాలంటీర్ల పరిస్థితి తెల్సిందే. వాలంటీర్ల ద్వారానే వైసీపీ దెబ్బతిందని కూటమికి వారితో పనిలేదన్నట్లు భావిస్తున్నారు.
వాలంటీర్లతో ప్రజలకు మంచి జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే రాజకీయంగా దెబ్బతిన్నామని వైసీపీ నేతలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నిర్మాణం లేకుండా పోయింది. ఇప్పటికీ వైసీపీ పార్టీ కమిటీలపై ఇంకా దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో ఐ-ప్యాక్ టీమ్ మళ్లీ వైసీపీ తరపున పని చేయడానికి వస్తోంది. గత ఐదేళ్లలో ఐ-ప్యాక్ చెప్పింది ఏదీ జరగలేదని.. అయినా మరి జగన్ ఐప్యాక్ టీంపై హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఇకనైనా ఐప్యాక్ టీం క్షేత్రస్థాయిలో పనిచేస్తే ఫలితాలు ఉంటాయనేది జగన్ భావన. 2019కంటే ముందు ఐప్యాక్‌ను ఎలా నడిపారో అదే స్థాయిలో మళ్లీ పనిచేయించుకోవాలని జగన్ అనుకుంటున్నారట.