ఏపీలో(AP) తాము ఎటువంటి సర్వే(Survey) నిర్వ‌హించ‌లేద‌ని వైసీపీ ఎన్నిక‌ల(YCP Elections) వ్య‌హ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఐ-పాక్(I-Pack) సంస్థ స్ప‌ష్టం చేసింది. ఐ-పాక్ సర్వే అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ఐప్యాక్ సంస్థ తెలిపింది. ఏపీలోని ఒక మీడియా చానల్ ఒక ఫేక్ సర్వేను ఐ-పాక్‌కు లింక్ చేస్తూ ప్రచారం చేసిందని ఖండించింది. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో ఓ ట్వీట్ చేసింది.

ఏపీలో(AP) తాము ఎటువంటి సర్వే(Survey) నిర్వ‌హించ‌లేద‌ని వైసీపీ ఎన్నిక‌ల(YCP Elections) వ్య‌హ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఐ-పాక్(I-PAC) సంస్థ స్ప‌ష్టం చేసింది. ఐ-పాక్ సర్వే అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ఐప్యాక్ సంస్థ తెలిపింది. ఏపీలోని ఒక మీడియా చానల్ ఒక ఫేక్ సర్వేను ఐ-పాక్‌కు లింక్ చేస్తూ ప్రచారం చేసిందని ఖండించింది. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో ఓ ట్వీట్ చేసింది.

ట్వీట్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మీడియా ఛానెల్ ఐ-ప్యాక్ కు లింక్ చేస్తూ ఫేక్ సర్వేను షేర్ చేసిందని.. ఐప్యాక్ ఎలాంటి సర్వేలను నిర్వహించదని పేర్కొంది. మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తమకు ఆపాదించిన ఏదైనా సర్వే పూర్తిగా అవాస్తవమని తెలిపింది. కొందరు వ్యక్తులు కానీ, గ్రూపులు కానీ చేస్తున్న పని ఇదని తెలిపింది.

ఇదిలావుంటే.. ఐ-ప్యాక్ స‌ర్వే అంటూ ప్రచారం చేస్తున్న ఆ సర్వే రిపోర్టులో.. వైసీపీకి మూడు ఎంపీ సీట్లలోనే స్పష్టమైన ఆధిక్యం ఉందని చెబుతున్నారు. మరో మూడు, నాలుగు సీట్లలో హోరాహోరీ కొనసాగుందని.. మిగిలిన 15పైగా సీట్లలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని.. వైసీపీ అధిష్టానానికి ఐప్యాక్ షాకింగ్‌ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు ఓ ఛానల్ కథనాలను ప్రచారం చేసింది.

Updated On 31 Aug 2023 11:32 AM GMT
Ehatv

Ehatv

Next Story