హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది' అని దేవుడంటే నమ్మకం లేని నాగబాబు అన్నారు

హిందూ ధర్మం ప్రమాదంలో ఉందనడానికి తిరుమల లడ్డూ అంశం క్లైమాక్స్‌ లాంటిదట! ఈ మాటన్నది దేవుడనేవాడు లేనే లేడని ఇంతకు ముందు చెప్పిన జనసేన జాతీయ కార్యదర్శి నాగబాబు(NagaBabu). ఇప్పుడాయన సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్నారు. సనాతన ధర్మం బతకడం నేర్పించిందని, దానికి అనయాయం జరుగుతోందనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan) మాట్లాడారని నాగబాబు చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు(Supreme Court) వ్యాఖ్యలు చేసిన తర్వాతే నాగబాబు ఇలా మాట్లాడటం విడ్డూరం. ' పవన్‌ కల్యాణ్‌ మాటలను పూర్తిగా సమర్థిస్తున్నా. హిందూ దేవాలయాలు, ధార్మిక మండళ్లు హిందువులే నిర్వహించాలి. ప్రభుత్వాల నిర్ణయాలు కోట్లాది మంది హిందువులపై ప్రభావం చూపుతున్నాయనేదే పవన్‌ కల్యాణ్‌ బాధ. అన్ని మతాలతో కలిసి ఉండే వ్యక్తి పవన్‌ కల్యాణ్. హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది' అని దేవుడంటే నమ్మకం లేని నాగబాబు అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దోషులెవరున్నా బయటకు వస్తారని అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు నాగబాబు.

ehatv

ehatv

Next Story