మంత్రి రోజా ఎప్పుడు ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. అయితే మంత్రి రోజా ఓ విషయంలో ఎమోషనల్ అయ్యారు.. ప్రస్తుతం రోజా చేసిన ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే తనపై వస్తున్న ఆరోపణల విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు.. తనపై వచ్చిన ఐరెన్ లెగ్ ముద్ర ఎందుకు వచ్చింది అన్నదానిపై క్లారిటీ వచ్చారు.

మంత్రి రోజా ఎప్పుడు ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. అయితే మంత్రి రోజా ఓ విషయంలో ఎమోషనల్ అయ్యారు.. ప్రస్తుతం రోజా చేసిన ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే తనపై వస్తున్న ఆరోపణల విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు.. తనపై వచ్చిన ఐరెన్ లెగ్ ముద్ర ఎందుకు వచ్చింది అన్నదానిపై క్లారిటీ వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు మంత్రి రోజా.. గతంలో టీడీపీ లో ఉన్నప్పుడు.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పుడు కూడా.. పదునైన విమర్శలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీలో చేరిన తరువాత.. చంద్రబాబు నాయుడు, లోకేష్ ను విమర్శించడంలో రోజా ముందుంటారు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా అదే స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.

ఆ ముగ్గురు నేతలే టార్గెట్ గా జబర్దస్థ్ పంచ్ లతో రోజా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. అలాంటిది ఎంతో దైర్యంగా ఎవ్వరికి భయపడకుండా విమర్శలు చేస్తూ ఉంటారు.. అందుకే రోజాను ఫైర్ బ్రాండ్ అంటారు.. రోజా మంత్రి అవ్వక ముందు వరకు ఆమె ఐరెన్ లెగ్ అంటూ ప్రత్యర్లు లు విమర్శలు చేసేవారు. అయితే గతంలో ఎప్పుడూ ఈ విమర్శలపై నేరుగా ఆమె స్పందించలేదు.. కానీ తాజాగా ఆమె చేసిన ఓ పోస్టు సంచలనంగా మారింది. తనపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని ఏపీ మంత్రి రోజా సంచలన పోస్ట్ పెట్టారు. జీవితంలో మన ఎదుగుదలని కించపరిచేవారు ఉంటారు అభినందించేవారు ఉంటారు, మన ఎదుగుదల మన చేతిలోనే ఉంటుంది అంటూ రోజా ఆ పోస్టులో కాస్త ఎమోషనల్ ఫీల్ అయ్యారు. దీంతో ఆ పోస్టు చర్చనీయాంశమైంది.

రాస్ ఆధ్వర్యంలో పుత్తూరులో జరిగిన మహిళాదినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోజా ... గర్భిణీ మహిళలకు శ్రీమంతం మరియు వృద్దులకి దుప్పట్లు చేతికర్రలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ ఆసక్తి కర పోస్ట్‌ చేశారు. ఇప్పుడెందుకు ఆమె ఈ పోస్ట్ చేశారన్నదే చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు తాను మధ్యతరగతి కుటుంబంలో పుట్టానని గుర్తు చేశారు. హీరోయిన్ గా, నాయకురాలిగా, మంత్రిగా మీ ముందుకి రావడం వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు పడ్డాను అని తన మనసులో బాధను అంతా బహిరంగపరిచారు. చాలా అవమానాలు పడిన తర్వాతే ఈ స్థాయి దక్కింది అన్నారు

తన జీవితం తెరిచిన పుస్తకం అన్న రోజా ... నిజానికి నాకు సినిమాల్లో అనుకోకుండా అవకాశం వచ్చినా, ఎన్నో అవాంతరాలు ఎదురైనా 150 సినిమాల్లో నటించ్చాను అని చెప్పారు. అలా కెరీర్ ఉన్నతంగా సాగడానికి సినిమాలు తీసిన దర్శక నిర్మాత లు ఆదరించిన ప్రజలు. తనను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. అలాగే రాజకీయాల్లో వార్డు సభ్యురాలిగా కూడా గెలవలేనని, ఐరన్ లెగ్ అనే ముద్ర వేయడానికి చాలా ప్రయాత్నాలు జరిగాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విమర్శలకు భయపడకుండా.. పట్టుదలతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. ఇప్పుడు మంత్రిగా మీ ముందు నిలిచి ఉన్నానంటే దీనికి కారణం ప్రజలను నమ్ముకోవడమే కారణం అన్నారు. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి అంటున్నారు.. ప్రస్తుతం రోజా సొంత నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నేతలే ఆమెకు వెన్ను పోటు పొడుస్తున్నారు. మంత్రి అయిన తరువాత ఆ కుట్రలు మరింత పెరిగాయని.. అందుకే ఆమె ఇలా ఆవేదన వ్యక్తం చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated On 13 March 2023 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story