Hyper Aadi: తక్కువ సీట్లు తీసుకుని అన్నీ గెలిచాడని పవన్ నిరూపిస్తారు: హైపర్ ఆది
పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయే వ్యక్తి కాదని హైపర్ ఆది అన్నారు. సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించే
కూటమిలో భాగంగా జనసేన పార్టీ చాలా తక్కువ సీట్లను తీసుకోవడంపై జనసేన అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే! చాలా మంది బహిరంగంగానే పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని విమర్శించారు. ఎంతో మంది జనసేనను వీడడానికి కూడా సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ నటుడు హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయే వ్యక్తి కాదని హైపర్ ఆది అన్నారు. సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. 24 సీట్లకే ఒకే చెప్పడం ఏంటని పవన్ గురించి మాట్లాడుతున్నారని, 2019లో పవన్‌ను గెలిపించుకోలేని మనకు ఆయన గురించి మాట్లాడే హక్కు ఉందా? అని హైపర్ ఆది ప్రశ్నించాడు. ఎక్కువ సీట్లు తీసుకుని ఇన్నే గెలిచాడా? అనిపించుకోవడం కంటే.. తక్కువ సీట్లు తీసుకుని అన్నీ గెలిచాడు అనిపించుకోవడం కరెక్ట్ అని భావించి పవన్ 24 సీట్లకే పరిమితమయ్యారని భావించాలన్నాడు హైపర్ ఆది. పవన్ గొప్ప నాయకుడు, ఆయన తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్నాడని చెప్పాడు. పరీక్షలో ఫెయిల్ అయితేనే మనం 10 రోజులు బయటకు రాలేమని... అలాంటిది రెండు చోట్ల ఓడిపోయినా రెండో రోజే కౌలు రైతుల కష్టాలు తీర్చిన గొప్ప మనసు పవన్ దని కొనియాడాడు. కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టారని, ప్యాకేజీ తీసుకున్నాడని చాలా ఈజీగా కామెంట్ చేస్తున్నారని, ఇలాంటి మాటలు ఎందుకని హైపర్ ఆది వివరించారు.