తెలుగు రాష్ట్రాలకు(Telugu States)రానున్న రెండు రోజుల పాటు వర్ష సూచన(Rain Alert) ఉన్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ . నైరుతీ గాలుల ప్రభావంతో అటు ఆంధ్ర(Andhra Pradesh) ,ఇటు తెలంగాణలోని (Telangana)పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది అమరావతి వాతావరణ శాఖ .

తెలుగు రాష్ట్రాలకు(Telugu States)రానున్న రెండు రోజుల పాటు వర్ష సూచన(Rain Alert) ఉన్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ . నైరుతీ గాలుల ప్రభావంతో అటు ఆంధ్ర(Andhra Pradesh) ,ఇటు తెలంగాణలోని (Telangana)పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది అమరావతి వాతావరణ శాఖ . ఉత్తర ,దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది..వరుస ఎండ,ఉక్కబోతతో కష్టాలు పడుతన్న ప్రజలకు ఇది చల్లటి వార్త అని చెప్పవచ్చు . వేడిగాలుల ప్రభావం తగ్గి ఈ సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఈనెల 25 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణ (Telangana)రాష్ట్రంలో అత్యధికంగా సూర్యాపేట(suryapet) జిల్లా గరిడేపల్లిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది అలాగే నల్గొండ(Nalgonda) జిల్లా కట్టంగూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఇక రాయలసీమలో కూడా అత్యధికంగాఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి . తెలంగాణలో (telangana)నేడు ,రేపు కొన్ని ప్రాంతాలలో ఉరుములు ,మెరుపులు ,ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అకాల వర్షాలతో ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించింది .

Updated On 22 April 2023 6:40 AM GMT
rj sanju

rj sanju

Next Story