Chandrababu : చంద్రబాబు గెలుపు కోసం నాలుక కోసుకున్న వ్యక్తి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విజయం కోసం ఓ వ్యక్తి బ్లేడ్‌తో నాలుక కోసుకున్న విచిత్రమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

Hyderabad man attempts to cut his tongue for Chandrababu Naidu’s victory
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విజయం కోసం ఓ వ్యక్తి బ్లేడ్‌తో నాలుక కోసుకున్న విచిత్రమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చంద్రబాబును ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతో నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన మహేష్ అనే వ్యక్తి నాలుక కోసుకున్నాడు. నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రార్థిస్తూ మహేష్ రాసిన లేఖను పోలీసులు గుర్తించారు. టీడీపీ-బీజేపీలు 100 నుంచి 145 సీట్లు గెలవాలని కూడా రాశారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ప్రార్థిస్తూ మహేశ్ గతంలోనూ ఇలాంటి చర్యకు పాల్పడ్డాడు.
