ఓయో(OYO) రూముల బుకింగ్స్‌లో హైదరాబాద్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా ఉన్నాయి. ఈ రిపోర్ట్‌ను ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే(Shreerang Godbole) విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా తగ్గిన తర్వాత దేశంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరిగే టూరిస్టులు ఎక్కువయ్యారని తెలిపారు.

ట్రావెలోపీడియా-2023 రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్‌లో(Hyderabad) ఈ ఏడాది ఎక్కువ మంది ఓయో రూమ్‌లను బుక్ చేసుకున్నారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు హైదరాబాద్‌లో ఎక్కువ బుకింగ్స్ నమోదయ్యయి. ద్వితీయశ్రేణి నగరాల్లో టాప్ 5లో గుంటూరు(Guntur), వరంగల్(Warangal) ఉన్నాయి. అయితే ఈ ఏడాది అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో(Uttar pradesh) రూమ్ బుకింగ్స్ నమోదయ్యాయి. నగరాల్లో హైదరాబాద్ తర్వాత బెంగళూరు(Bengaluru), ఢిల్లీ(Delhi), కోల్‌కతా ఉన్నాయి. ద్వితీయశ్రేణి నగరాల్లో యూపీలోని గోరఖ్‌పూర్ టాప్ వన్‌లో ఉండగా.. పశ్చిమబెంగాల్‌లోని దిఘా, వరంగల్, గుంటూరు పట్టణాలు నిలిచాయి. ఆధ్యాత్మికంగా ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతాల్లో పూరీ(Puri) టాప్ వన్‌లో ఉంది. అమృత్‌సర్, వారణాసి, హరిద్వార్ ఉన్నాయి.
ప్రశాంతంగా ఉండడానికి జయపురాను ఎక్కువగా బుక్‌చేసుకోగా తర్వాత గోవా(Goa), మైసూర్, పుదుచ్చేరి ఉన్నాయి. ఓవరాల్‌గా హోటల్ రూమ్‌లను బుక్ చేసుకున్న రాష్ట్రల్లో తొలి స్థానం ఉత్తరప్రదేశ్‌దే. తర్వాత వరుసగా మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ ఉన్నాయి.