తిరుమలలో(Tirumala) భక్తుల(Piligrims) రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. బుధవారం అయితే తిరుమల భక్తులతో కిటకిటలాడింది.
తిరుమలలో(Tirumala) భక్తుల(Piligrims) రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. బుధవారం అయితే తిరుమల భక్తులతో కిటకిటలాడింది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. రాత్రి ఒంటి గంట నుంచి అయిదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయంటే రద్దీ ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఉదయం ఆరు గంటలకు గేట్లు తెరవడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. టైమ్ స్లాట్ టోకెన్లు తీసుకున్న భక్తులు వెనక్కి వచ్చి కార్లు, బస్సుల్లో(Bus) తిరుమలకు వెళ్లారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని వారు కాలినకడన బయలుదేరారు. ఆటోలు, టాక్సీలకు డిమాండ్ పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి అయిదు గంటల సమయం పడుతోంది. బుధవారం 79,584 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,848 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం శ్రీవారికి 4.18 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది.