కృష్ణా నది(Krishna River)లో లెక్కకు మించి నాగ ప్రతిమలు(Naga idols) బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. స్థానికులు కాసింత ఆయోమయానికి, కాసింత భయానికి లోనవుతున్నారు. తాడేపల్లి(Tadepalle) మండలం, సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో ఈ ప్రతిమలు బయటపడ్డాయి. అయితే ఇవి ఎక్కడ నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియడం లేదు. అసలు ఈ నాగ ప్రతిమలు ఇప్పుడు చెక్కినవా?

కృష్ణా నది(Krishna River)లో లెక్కకు మించి నాగ ప్రతిమలు(Naga idols) బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. స్థానికులు కాసింత ఆయోమయానికి, కాసింత భయానికి లోనవుతున్నారు. తాడేపల్లి(Tadepalle) మండలం, సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో ఈ ప్రతిమలు బయటపడ్డాయి. అయితే ఇవి ఎక్కడ నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియడం లేదు. అసలు ఈ నాగ ప్రతిమలు ఇప్పుడు చెక్కినవా? లేక ప్రాచీన కాలానికి సంబంధించిన వా అన్నది ఆరా తీస్తున్నారు. శిల్పులు చెక్కిన శిల్పాలలో పాడైపోయినవాటిని నదిలో వదిలిపెట్టారా? లేకపోతే ఎక్కడైనా కూల్చివేత గుడుల విగ్రహాలను ఇక్కడ నదిలో వేశారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నాగ ప్రతిమల విగ్రహాలను చాలా శక్తివంతమైనవని, వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని, దోషాలు చుట్టుకుంటాయని స్థానికులు అంటున్నారు. ఆ భయం కొద్దే ఇలా నదిలో విగ్రహాలు వదిలి వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు. ఈ విగ్రహాలు ఎప్పటివో తెలియాలంటే వీటిపై పరిశోధన జరగవలిసిన అవసరం ఉంది. కృష్ణ నది లోతులలో మరిన్ని విగ్రహాలు వుండే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated On 26 Jun 2023 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story