దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకుని తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వెలుగుల పండుగ రోజున మొత్తం 74,807 మంది భక్తులు కలియుగదైవం వేంకటేశ్వరస్వామిని(Venkateshwara Swamy) దర్శించుకున్నారు.

దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకుని తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వెలుగుల పండుగ రోజున మొత్తం 74,807 మంది భక్తులు కలియుగదైవం వేంకటేశ్వరస్వామిని(Venkateshwara Swamy) దర్శించుకున్నారు. 21,974 మంది భక్తులు తలనీలాలు(Hair) సమర్పించుకున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న కారణంగా టోకెన్‌లు లేని భక్తులకు సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. పండుగ సందర్భంగా శ్రీవారికి హుండీ ఆదాయం కూడా భారీగా వచ్చింది. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్ల రూపాయలు వచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. స్వామి వారిని, అమ్మవారిని రంగురంగుల పూలతో అలంకరించారు.

Updated On 13 Nov 2023 12:51 AM
Ehatv

Ehatv

Next Story