తిరుమల(Tirumala) భక్తులతో(Devotees) కిటకిటలాడుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వ దర్శనానికి ఇవాళ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. శనివారం వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) పండుగను పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు.

తిరుమల(Tirumala) భక్తులతో(Devotees) కిటకిటలాడుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వ దర్శనానికి ఇవాళ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. శనివారం వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi) పండుగను పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణ గిరి షెడ్లు నిండిపోయాయి. నారాయణగిరి(Narayagiri) అతిథి గృహం వరకు క్యూలైన్‌(Queue Line) చేరుకుంది. దీంతో వైకుంఠద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి, టోకెన్లు లేని వారిని దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు అనుమతించడం లేదు. రేపటి సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లలోకి పంపిస్తామని పేర్కొన్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని మొదట ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో టోకెన్లు ఉన్నవారికే దర్శనానికి అనుమతిస్తోంది. మరోవైపు శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్లను టీటీడీ పంపిణీ చేస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో రాత్రి నుంచే టోకెన్లు జారీ చేయడం ప్రారంభించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల కోసం టికెట్లను ప్రత్యేక రంగుల్లో ముద్రించారు. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

Updated On 22 Dec 2023 4:06 AM GMT
Ehatv

Ehatv

Next Story