వ్యవసాయ(Farming), ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలపై గురువారం రాష్ట్ర వ్యవసాయం మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani govardha reddy) సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలకు జరిగిన పంటల నష్టాల అంచన, నష్టపరిహారం అందించేందుకు చర్యలు, రైతులు పండించిన మొక్కజొన్న(Corn) తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బికేల ద్వారా అందించడం, తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.

మంత్రి కాకాణి మాట్లాడుతూ.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగం పట్ల అంచనాలు తయారు చేయడంలో గానీ, నష్టపరిహారం అందించడంలో గానీ, ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ఆదేశాలనుసారం ఉదారంగా వ్యవహరించేందుకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి సీనియర్ అధికారులను కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాజీపడకుండా మొక్కజొన్న కొనుగోలు చేయడంతో పాటు, గిట్టుబాటు ధర లభించని ఇతర పంటలను గుర్తించి, కొనుగోళ్లు చేపట్టవలసిందిగా సూచించారు.

ఖరీఫ్ సీజన్ కు సంబంధించి, సబ్సిడీ విత్తనాలు అందించేందుకు ఖరారు చేసిన యాక్షన్ ప్లాన్ ను మంత్రి పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి, అవసరమైన ఎరువులు, పురుగు మందులు ఆర్బికేలలో నిల్వ చేసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం రైతాంగానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అధికార యంత్రంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్నారు.

సమీక్షలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సహకార మరియు మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ కమీషనర్ హరికిరణ్, ఉద్యానవన శాఖ కమీషనర్ శ్రీధర్, మార్కెటింగ్ శాఖ కమీషనర్ రాహుల్ పాండే, ఏపీ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బాబు, ఏపీ ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Updated On 11 May 2023 6:11 AM GMT
Ehatv

Ehatv

Next Story