AP Budget Funds : పవన్, లోకేష్ శాఖలకు నిధులెన్నో తెలుసా..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం(AP Alliance Government) తొలిసారి బడ్జెట్(AP Budget) ప్రవేశపెట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం(AP Alliance Government) తొలిసారి బడ్జెట్(AP Budget) ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఓటాన్ బడ్జెట్‌తో నడుస్తోంది.. ఈ క్రమంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2,94,427.25 కోట్లతో పూర్తి స్థాయిబడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan), మంత్రి లోకేష్(Lokesh) నిర్వహిస్తున్నాశాఖలకు ఎంత కేటాయించారన్నది ఆసక్తిగా మారింది.
పవన్ కల్యాణ్ శాఖలకు నిధులు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి(rural development) శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయించారు. గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఎత్తును నిధులు ఖర్చుచేయనున్నట్లు బడ్జెట్ ద్వారా తెలుస్తోంది. పవన్ నిర్వహిస్తున్న మరో శాఖ అటవీ(Forest). దీనికి ప్రభుత్వం రూ.687 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 1,574 పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు 2,134 ఆవాసాలను 2,855 కిలోమీటర్ల రహదారులతో కలుపుతుందని వివరించారు. అదనంగా 164 రహదారులు, వంతెనల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇలా పల్లెలను ప్రగతి పథంలో నడిపేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయించారు.
లోకేష్ నిర్వహించే శాఖలకు ఇచ్చిన నిధులు
లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖకు(Education department) 29,909 కోట్ల రూపాయలు కేటాయించారు. నైపుణ్యాభివృద్ధి శాఖకు(Skill Development department) 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1,215 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉన్నత విద్యా శాఖకు 2,326 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. మూడేళ్లలో 18 వేల మంది ఉపాధ్యాయులకు ట్రైనింగ్(Teacher training) కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2024 డిసెంబర్ నుంచి 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు వృత్తి శిక్షణ ఇచ్చేందుకు నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్, ఎడ్యుస్కిల్స్, సేల్ఫోర్స్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. 5 వేల నుంచి 15 వేల రూపాయల వరకు వేతనాన్ని అందించే అప్రెంటిస్‌షిప్‌తో కూడిన డిగ్రీ అందించనున్నారు.