YS Vijayamma:విజయమ్మ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి - వై.ఎస్‌.షర్మిలారెడ్డి మధ్య జరుగుతోన్న ఆస్తుల పంచాయితీని తమకు అనుకూలంగా రాసుకుని తెగ ఆనందపడిపోతున్నది ఓ వర్గం మీడియా! అదో పెద్ద సమాజిక సమస్యగా రోజుకో కథనాన్ని వండుతూ పేజీలకు పేజీలు నింపుతోంది. ఇదే సమయంలో అన్నాచెల్లెళ్ల మధ్య గొడవపై తల్లి విజయమ్మ(YS Vijayamma)మాత్రం పెదవి విప్పడం లేదు. ఎవరి పక్షం వహించాలో తెలియక ఆ తల్లి తల్లడిల్లుతోంది. షర్మిల(Ys Sharmila) చేస్తున్నది తప్పని ఆమెకు కూడా తెలుసు! అయినా కూతురు మీద అతి ప్రేమ కారణంగా ఆమె మౌనంగా ఉంటున్నారు. మొన్న షర్మిల ప్రెస్‌ మీట్ పెట్టి జగన్‌ను నానా మాటలు అనేసి, తర్వాత కన్నీరు కార్చారు కదా! అప్పుడే తల్లి విజయలక్ష్మి గురించి కూడా రెండు ముక్కలు చెప్పారు. జగన్‌ తీరుపై తమ తల్లి విజయలక్ష్మి కుమిలిపోతున్నదని, ఇలాంటివి చూడడానికి తానెందుకు ఇంకా బతికి ఉన్నానా? అని ఆవేదన చెందుతున్నదని షర్మిల చెప్పుకొచ్చారు.

ఇలాంటి కొడుకును చిన్న వ‌య‌సులోనే ఎందుకు చంప‌లేద‌ని త‌న త‌ల్లి అన‌లేద‌ంటూ ఓ దిక్కుమాలిన వ్యాఖ్య కూడా చేశారు. ఇంత జరుగుతున్నా విజయమ్మ ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఒకవేళ జగన్‌(Ys Jagan) చేస్తున్నది తప్పే అయితే బాహాటంగా వచ్చి చెప్పవచ్చు కదా! జగన్‌ బెయిల్‌ రద్దు కోసం కుట్ర జరుగుతున్నదని లెటెస్ట్ ఎపిసోడ్‌ రుజువు చేస్తున్నది కదా! కొడుకును జైలుకు పంపాలని ఏ తల్లి అయినా కోరుకుంటారా? ఆమె మౌనంగా ఉండటం చూస్తుంటే జగన్‌ను మళ్లీ జైలుకు పంపించడానికి తెలుగుదేశంపార్టీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నట్టుగానే భావించాలి. సరస్వతీ పవర్‌ ప్లాంట్(Saraswati Power Plant) షేర్లకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసి కూడా విజయమ్మ ట్రాన్స్‌ఫర్‌ పేపర్లపై సంతకాలు చేశారంటే ఆమె షర్మిల ట్రాప్‌లో పడిపోయారనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన తన కూతురు షర్మిలను గెలిపించాలంటూ అప్పుడు విదేశాల్లో ఉన్న విజయమ్మ ఓ వీడియో చేసి పంపించారు. మరి కొడుకు కూడా అప్పుడు పోటీ చేశారు కదా! ఆయన గెలుపును విజయమ్మ ఎందుకు కోరుకోలేదు? మొత్తంగా చూస్తే విజయమ్మ వైఖరి సందేహాస్పదంగా ఉంది. కన్నకొడుకుపై కక్ష కట్టినట్టుగా అనిపిస్తోంది.

ehatv

ehatv

Next Story