ఏపీలో (AP)సొంత ఇల్లు(Own House) కట్టుకుంటే ఇచ్చే ఆర్థిక సాయంపై మార్గదర్శకాలు ఇచ్చారు.

ఏపీలో (AP)సొంత ఇల్లు(Own House) కట్టుకుంటే ఇచ్చే ఆర్థిక సాయంపై మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం(Avas Yojana Scheme) 2.0 పథకం కింద ఇల్లు కట్టుకునేవారికి రూ.4 లక్షలు ఆర్థిక సాయం(Financial Aid) ఇవ్వాలని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశ్చయించాయి. ఈ పథకం అమలుకు ప్రతి రాష్ట్రం తమ వాటా నిధులను ఇవ్వాల్సిందేనని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పథకానికి సంబంధించి డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌ను అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం పంపింది. ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షల ఆర్థిక సాయం చేయనుననారు. ఇందులో కేంద్ర వాటా రూ.2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.1.50 లక్షలు అని కేంద్రం గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుడికి 2.5 సెంట్ల-5 సెంట్ల వరకు ఇళ్ల స్థలం ఉన్నా అర్హుడే. లబ్దిదారుడికి తెల్ల రేషన్‌ కార్(White ration card)డు ఉండాలి. లబ్దిదారుడు ఆధార్ కార్డ్(Aadhaar card), అడ్రెస్ ప్రూఫ్(adress proof), తెల్ల రేషన్ కార్డు, నో హౌస్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్‌లు తప్పనిసరిగా కలిగి ఉండాలని నిర్ణయించారు. పట్టణాల్లో పథకం లబ్ధిదారుగా ఉండాలంటే అతనికి రాష్ట్రంలో ఎక్కడా ఇల్లు ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వ హౌసింగ్‌ స్కీంలో లబ్దిదారుడు అయి ఉండకూడదు. లబ్దిదారుడి వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు లోబడి ఉండాలని నిబంధనలు విధించారు. ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకంపై 1902కు ఫోన్‌ లేదా [email protected]కు ఈమెయిల్‌ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు.

Eha Tv

Eha Tv

Next Story