టీడీపీ(TDP)-బీజేపీలతో(BJP) కుదుర్చుకున్న సీట్ల సర్దుబాటులో అనకాపల్లి నియోజకవర్గం సీటు జనసేనకు(Janasena) లభించింది. ఇక్కడ్నుంచి జనసేన పార్టీ తరఫున మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ(Konatala Ramakrishna) పోటీ చేస్తున్నారు. అసలు కొణతాలకు టికెట్ దక్కడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజమేనా అన్న భావనలో ఉన్నారు. ఎందుకంటే గత అయిదేళ్లుగా కొణతాల రామకృష్ణ రాజకీయంగా అజ్ఞాతంలో ఉండిపోయారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు.

టీడీపీ(TDP)-బీజేపీలతో(BJP) కుదుర్చుకున్న సీట్ల సర్దుబాటులో అనకాపల్లి నియోజకవర్గం సీటు జనసేనకు(Janasena) లభించింది. ఇక్కడ్నుంచి జనసేన పార్టీ తరఫున మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ(Konathala Ramakrishna) పోటీ చేస్తున్నారు. అసలు కొణతాలకు టికెట్ దక్కడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజమేనా అన్న భావనలో ఉన్నారు. ఎందుకంటే గత అయిదేళ్లుగా కొణతాల రామకృష్ణ రాజకీయంగా అజ్ఞాతంలో ఉండిపోయారు. ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వలేదు. అలాంటి కొణతాలను జనసేనని పవన్‌ కల్యాణ్‌(Pawan kalayn) కలవడం, పార్టీలోకి ఆహ్వానించడం చకచక జరిగిపోయాయి. ఈ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే అనకాపల్లి టికెట్‌ను(Anakapalle MLA Ticket) కూడా ఆయనకు ఇచ్చేశారు పవన్‌. అసలు కొణతాల మీద పవన్‌కు గురి ఎలా పడిందో, ఈ లింక్‌ ఎక్కడ కుదిరిందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు కార్యకర్తలు. కొణతాల రాజకీయ ప్రయాణమంతా కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తోనే సాగాయి. తెలుగుదేశంపార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మరి టికెట్‌ ఎలా వచ్చినట్టు?
బ్రో సినిమా షూటింగ్‌ అప్పుడు కొణతాల పేరును పవన్‌ మొదటిసారి విన్నారట! అది ఎలాగంటే ఆ సినిమాకు త్రివిక్రమ్‌కు అసోసియేట్‌గా చిన్ని కృష్ణ అనే అతడు పనిచేశాడు. అంతకు ముందు చిన్ని కృష్ణ లండన్‌ బాబులు అనే సినిమాను రూపొందించాడు. కొణతాల రామకృష్ణకు చిన్నికృష్ణ చాలా దగ్గర బంధువట! ఆ విషయం త్రివిక్రమ్‌కు తెలిసింది. త్రివిక్రమ్‌ ద్వారా పవన్‌ కల్యాణ్‌కు తెలిసింది. బ్రో సినిమా సమయంలోనే త్రివిక్రమ్‌కు చిన్ని కృష్ణ చాలా దగ్గరయ్యారు. ఆయన దృష్టిలో పడ్డారు. చిన్ని కృష్ణ పనితనం మీద గురి కుదిరిన త్రివిక్రమ్‌ అతడిని పీపుల్స్‌ మీడియాలో కీలక బాధ్యతను అప్పగించారు. త్రివిక్రమ్‌-చిన్ని కృష్ణలు తరచుగా కొణతాల గురించి మాట్లాడుకునేవారట! అలా పవన్‌ దృష్టిలో కొణతాల పడ్డారట! పైగా మృదుస్వభావి, మంచివాడు, సౌమ్యుడు అన్న పేరు కొణతాలకు ఉంది. ఇవన్నీ పక్కన పెడితే తన తల్లి విజయమ్మ విశాఖలో ఓడిపోవడానికి కొణతాల రామకృష్ణనే కారణమన్నది జగన్‌ భావన. ఆ అభిప్రాయంతోనే కొణతాల మీద కొంచెం కోపం పెట్టుకున్నాడు. ఇది చాలదా పవన్‌కు కొణతాల దగ్గరవ్వడానికి! ఎందుకంటే జగన్‌కు ఎవరైతే ఇష్టం ఉండరో వారు కచ్చితంగా పవన్‌కు ఆప్తులవుతారు. ఇవన్నీ కొణతాలను పవన్‌కు దగ్గరకు తీసుకెళ్లాయి.

Updated On 15 March 2024 3:48 AM GMT
Ehatv

Ehatv

Next Story