Buggana Rajendranath : మంత్రి బుగ్గన బృందంపై తేనెటీగల దాడి
ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్(Buggana Rajendranath) బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. నంద్యాల జిల్లా(Nandyal district) బేతంచెర్ల(Bethamcherla) మండలం కనుమకింద కొట్టాల గ్రామంలో ఎర్రజాల గుహల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్ళిన మంత్రి బుగ్గన బృందంపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 70 మంది వరకు గాయాలు కాగా..

Buggana Rajendranath
ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్(Buggana Rajendranath) బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. నంద్యాల జిల్లా(Nandyal district) బేతంచెర్ల(Bethamcherla) మండలం కనుమకింద కొట్టాల గ్రామంలో ఎర్రజాల గుహల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్ళిన మంత్రి బుగ్గన బృందంపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 70 మంది వరకు గాయాలు కాగా.. మంత్రి బుగ్గనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. గాయపడ్డ వారిని సమీపంలోని బేతంచర్ల పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి బుగ్గన ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. తేనె టీగల దాడిలో తీవ్రంగా గాయపడిన పంచాయతీ సెక్రెటరీ స్వామి నాయక్ పరిస్ధితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ దాడిలో నలుగురు జర్నలిస్టులు, మరొకరు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆరుగురికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
