ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. చాగల్లు మండలం చాగల్లు గ్రామంలోని సచివాలయం-3 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు.

ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత(Taneti Vanitha) తెలిపారు. చాగల్లు(Chagallu) మండలం చాగల్లు గ్రామంలోని సచివాలయం-3 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం(Gadapa Gadapa ki Mana Prabhuthvam) కార్యక్రమం ప్రజాధరణ పొందుతుందని తెలిపారు. ఈ ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లాలని చూసినా.. ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలుసు కాబట్టి వాటిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని ప్రజలను ఆమె కోరారు.

ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి తమ ప్రభుత్వ హాయాంలో ఈ మేలు చేశామని చెప్పగలుగుతున్నామని తెలిపారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు అయినా సరే అర్హత ఉంటే సంక్షేమం నేరుగా అందిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకులకు ఎవరికైనా అర్హత ఉండి తమ కుటుంబానికి సంక్షేమం అందలేదని ఎవరైనా ఉంటే.. వెంటనే వాళ్లకు సంక్షేమం అందించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కలిసి గుంపులు, గుంపులుగా వస్తున్నా.. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజల ఆదరణ చూస్తుంటే రానున్న ఎన్నిక(Elections)ల్లో 175కి గానూ 175 స్థానాల్లో ఘనవిజయం సాధించడం ఖాయమనిపిస్తోందని తెలిపారు.

ప్రతిపక్షాల ఎత్తుగడలను అర్థం చేసుకుని.. ఎవరు, ఎంతమంది కలిసి వచ్చినా జగన(Jagan)న్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత సంక్షేమం అందుకుంటున్న ప్రతి కుటుంబంపై ఉందని హోంమంత్రి అన్నారు. మేనిఫెస్టో(Manifesto)లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్ ఒక్కరే అన్నారు. జగనన్నప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో, ఏఏ వర్గాలకు చెందుతున్నాయో, ఏమాత్రం చెందుతున్నాయో అన్న అంశాలపై హోంమంత్రి(Home Minister) ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం లో 99 శాతం పథకాలను మహిళల పేరుతోనే అందిస్తున్నామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు."Written By : Senior Journalist M.Phani Kumar"

Updated On 17 Oct 2023 6:40 AM GMT
Yagnik

Yagnik

Next Story