ఓ యువకుడికి 2013లో హెచ్‌ఐవీ వచ్చింది. ప్రస్తుతం అతనికి 35 ఏళ్లు ఆరోగ్యంగానే ఉన్నాడు.

ఓ యువకుడికి 2013లో హెచ్‌ఐవీ వచ్చింది. ప్రస్తుతం అతనికి 35 ఏళ్లు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ క్రమంలో ఓ యువతిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలోని ఓ చర్చిలో పెళ్లి జరిగే సమయానికి ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌జీవోస్ ప్రతినిధులు వచ్చి వివాహాన్ని అడ్డుకున్నారు. అయితే ఓ యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియడంతో ఆరోగ్యంగా ఉన్న యువతిని అనారోగ్యం బారిన పడకుండా కాపాడేందుకు ఏపీ ఎన్‌జీవోస్‌(AP NGOs) మహిళా ప్రతినిధులు క్రిస్టియన్‌పేట వచ్చి చర్చి పాస్టర్‌కు వివరించారు. అమ్మాయి బంధువులతో పెళ్లి కొడుకుకు హెచ్‌ఐవీ(HIV Positive) ఉందని చెప్పడంతో వారు వివాహాన్ని నిలిపివేశారు. వివాహం నిలిపివేయడంతో పెళ్లికొడుకు బంధువులు పెళ్లికూతురు బంధువులతో గొడవకు దిగారు. వివాహం చేసే పాస్టర్‌, హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉంటే ఎలా వివాహం జరిపిస్తామని మాట్లాడడంతో పెళ్లికొడుకు బంధువులు అక్కడ ఉన్నవారిపై దాడికి పాల్పడ్డారు.దీంతో సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. దాడికి పాల్పడ్డవారిపై కేసులు నమోదుచేసి విచారణ చేపట్టారు.

ehatv

ehatv

Next Story