Balakrishna Support to Pawan Varahi Yatra : పవన్ ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) చేపట్టిన ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత(TDP) నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) వెల్లడించారు. కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.

Pawan Kalyan Varahi Yatra
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) చేపట్టిన ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత(TDP) నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) వెల్లడించారు. కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు. ఆయనపై స్కిల్ కేసును రాజకీయ కక్షతోనే పెట్టారని బాలకృష్ణ ఆరోపించారు. ఈ సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, బీద రవిచంద్ర, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు.
