Betting On AP Election Results : టెన్షన్‌తో చచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు
టెన్షన్ భరించలేకపోతున్నాంరా బాబూ..! మునుగుతామో, తేలతామో తర్వాత సంగతి.. రిజల్ట్స్ త్వరగా వస్తే బాగుణ్ణు.. ఇలాగని రోజుకు నాలుగైదు సార్లు అయినా అనుకోకుండా ఉండటం లేదు. ఎవరు? ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులా? రాజకీయపార్టీల అధినేతలా? పార్టీలకు కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలకా? వీరెవ్వరికీ కాదు.. బెట్టింగ్ బాబులు!
టెన్షన్ భరించలేకపోతున్నాంరా బాబూ..! మునుగుతామో, తేలతామో తర్వాత సంగతి.. రిజల్ట్స్ త్వరగా వస్తే బాగుణ్ణు.. ఇలాగని రోజుకు నాలుగైదు సార్లు అయినా అనుకోకుండా ఉండటం లేదు. ఎవరు? ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులా? రాజకీయపార్టీల అధినేతలా? పార్టీలకు కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలకా? వీరెవ్వరికీ కాదు.. బెట్టింగ్ బాబులు! డబ్బులు పెట్టి ఇన్ని రోజులు ఎదురుచూడటం ఎవరికైనా కష్టమే! ఎన్నికలయ్యాక.. ఎవరికి తోచినట్టు వారు చెప్పుకొస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో, కూటమి కూడా అంతే నిబ్బరంగా ఉంది. పైపెచ్చు రోజుకో సర్వే వస్తోంది. కొన్ని సర్వేలు పాపులర్ ఛానల్స్ లోగోలతో ఉంటున్నాయి. ఇవి సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతుంటే బెట్టింగ్ రాయళ్లకు చక్కరొచ్చినంత పని అవుతోంది. హార్ట్ బీట్ పెరుగుతోంది. బీపీ పెరుగుతోంది. ఈ ఫేక్ సర్వేలన్నీ తమను ఆ ఉచ్చులోకి లాగేందుకే అన్న విషయాన్ని బెట్టింగ్ రాయుళ్లు తెలుసుకోవడం లేదు. అందుకే లక్షలాది రూపాయలు కాస్తున్నారు. అరకొర సంపాదన ఉన్నవారు సైతం బెట్టింగ్‌లు కాస్తున్నారు. అదృష్టం కలిసివస్తే లక్షలు సంపాదించవచ్చన్న ఆశ! ఇక డబ్బున్న మారాజులైతే కోట్లు పణంగా పెడుతున్నారు. వైసీపీ(YCP) గెలుస్తుందా? కూటమి(Alliance) గెలుస్తుందా? అన్న విషయంలోనే కాదు పందాలు కాస్తున్నది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? కుప్పం(Kuppam)లో చంద్రబాబు(Chandrababu) గెలుస్తాడా? గెలిస్తే మెజారిటీ ఎంతుంటుంది? మంగళగిరి(Mangalagiri) సంగతేమిటి? లోకేశ్(Nara Lokesh) ఈసారైనా గట్టెక్కుతాడా? పిఠాపురం(Pithapuram)లో పవన్‌కల్యాణ్(Pawan Kalyan) విజయం సాధిస్తాడా? రూపాయికి పది రూపాయల బెట్టింగ్ నడుస్తున్నదని సమాచారం. పందెం కాసినవాడిని నిమ్మళంగా ఉండనివ్వడం లేదు సర్వేలు. భయపెట్టి నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఏ సర్వేను నమ్మాలో తెలియని విచిత్ర పరిస్థితి. ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఫలితాలు వచ్చే వరకు 20 రోజుల వ్యవధి ఉంది కాబట్టే బెట్టింగుల జోరు పెరుగుతోంది. అప్పులు చేసి మరీ పందెం కాస్తున్నారు. జూన్ 4వ తేదీన అభ్యర్థుల జాతకాలే కాదు, పందెం రాయుళ్ల భవితవ్యం కూడా తెలుస్తుంది. నిండా మునుగుతారో, నిండుగా నవ్వుతారో తెలిసిపోతుంది. అప్పటి వరకు టెన్షన్ తప్పదు.