Amalapuram : అమలాపురంలో టెన్షన్.. టెన్షన్
అమలాపురం మండలం ఈదరపల్లిలో వైసీపీకి చెందిన పోలిశెట్టి కిషోర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

High Tension In Amalapuram
అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) అమలాపురం(Amalapuram) మండలం ఈదరపల్లిలో వైసీపీకి చెందిన పోలిశెట్టి కిషోర్(Polishetti Kishore) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ముందు జాగ్రత్తగా పట్టణంలో భారీగా మోహరించారు. కిషోర్‌ను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటనపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే.. టీడీపీ నేత నిమ్మకాయల చిన రాజప్ప(Nimmakayala Chinarajappa) ప్రధాన అనుచరుడుకు చెందిన అమలాపురంలోని ఓ రియల్ ఎస్టేట్(Real Estate) ఆఫీస్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఇది కిషోర్ హత్యకు ప్రతికార చర్యగా పోలీసులు భావిస్తున్నారు.
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయన్న ముందస్తు సమాచారంపై పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. డీఐజీ అశోక్(DIG Ashok) ఆదేశాల మేరకు.. జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్(S Sridhar), పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్(Ravi Prakash) పర్యవేక్షణలో దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు.
