Jada Sravan Kumar : శ్రవణ్ కుమార్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి
జూలై 8న జై భీమ్ భారత పార్టీ(Jai Bheem Bharat Party) వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్(Jada Sravan Kumar) తలపెట్టిన పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతినిచ్చిన హైకోర్టు. రాజధాని అమరావతి ప్రాంతంలో దళిత బహుజన రైతులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పాదయాత్రకు అనుమతినివ్వాలి అంటూ ఇప్పటికే రెండుసార్లు తుళ్లూరు పోలీసులకు జై భీమ్ భారత పార్టీ అభ్యర్థన. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు కారణంగా ఈ నెల 2 వ తారీకున అనుమతినీ నిరాకరించిన పోలీసులు.
జూలై 8న జై భీమ్ భారత పార్టీ(Jai Bheem Bharat Party) వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్(Jada Sravan Kumar) తలపెట్టిన పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతినిచ్చిన హైకోర్టు. రాజధాని అమరావతి ప్రాంతంలో దళిత బహుజన రైతులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పాదయాత్రకు అనుమతినివ్వాలి అంటూ ఇప్పటికే రెండుసార్లు తుళ్లూరు పోలీసులకు జై భీమ్ భారత పార్టీ అభ్యర్థన. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు కారణంగా ఈ నెల 2 వ తారీకున అనుమతినీ నిరాకరించిన పోలీసులు. జడ శ్రావణ్ కుమార్ పాదయాత్రకు అనుమతి నిరాకరించడాన్ని హైకోర్టులో సవాలు చేసిన ఆ పార్టీ విజయవాడ అధ్యక్షులు పరసా సురేష్ కుమార్(Suresh Kumar Parasa). ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వాడి వేడిగా వాదనలు. రాజధాని అమరావతి ప్రాంతంలో జడ శ్రావణ్ కుమార్ పర్యటన కులమత ఘర్షణలకు తావిస్తుందని అక్కడున్న పరిస్థితుల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వటం కుదరదని ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్ రెడ్డి వాదనలు. పాదయాత్ర చేయటం ప్రజలకు పార్టీలకు ఉన్న హక్కు అని అలాంటి హక్కు కాలరాయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన రేగులగడ్డ వెంకటేష్. ఇరు వాదనలు విన్న హైకోర్టు(High Court). జూలై 8 వ తారీకు ఉదయం 11 గంటల నుండి నాలుగు గంటల వరకు పాదయాత్ర చేసుకోవచ్చు అంటూ అనుమతి. 200 మంది ఆధార్ కార్డులు సమర్పిస్తూ ఎటువంటి ఉద్వేశపూరిత ప్రసంగాలు చేయవద్దు అంటూ నిర్దేశించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన జై భీమ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్. హైకోర్టు సూచనలు కనుగుణంగా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొనకుండా పాదయాత్ర కొనసాగిస్తామని ప్రకటన. రాజధాని ప్రాంతంలో దళిత బహుజన రైతులకు జరుగుతున్న అన్యాయాలను స్మృతి వనంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి రూపంలో సమర్పిస్తామంటూ ప్రకటన.