తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రంపై కూడా పడింది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వర్షాల కారణంగా చాలా మంది తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. తిరుపతి వరకు చేరుకున్న కొందరు వేరువేరు కారణాలతో కొండపైకి వెళ్లలేకపోతున్నారు. దీంతో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం సర్వదర్శనం కేవలం ఆరు గంటల్లోనే జరగడం ఇందుకు ఉదాహరణ. మంగళవారం శ్రీవారిని 73,137 మంది దర్శించుకున్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రంపై కూడా పడింది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వర్షాల కారణంగా చాలా మంది తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. తిరుపతి(Tirupathi) వరకు చేరుకున్న కొందరు వేరువేరు కారణాలతో కొండపైకి వెళ్లలేకపోతున్నారు. దీంతో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం సర్వదర్శనం కేవలం ఆరు గంటల్లోనే జరగడం ఇందుకు ఉదాహరణ. మంగళవారం శ్రీవారిని 73,137 మంది దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 27,490గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్ల రూపాయలుగా ఉంది. ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులు త్వరగా స్వామివారి దర్శనం పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే, భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లు ఆన్ లైన్ లో చేసుకుని ఆ తర్వాతే కొండపైకి రావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు. ముందస్తుగా బుక్ చేసుకోకపోతే.. కొండపై కష్టమవుతుందని, సర్వదర్శనం మినహా ఏ విధంగా దర్శించుకోలేరని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, సెప్టెంబర్ లో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో మరమ్మతులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆగస్టు నెల మొత్తం శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నారు.
మరోవైపు తిరుపతి, తిరుమలలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. మధ్యమధ్యలో కొంత తెరిపినిచ్చినా వర్షం మాత్రం పూర్తిగా తగ్గడం లేదు. కొండ మీద చలి పెరిగింది.

Updated On 26 July 2023 4:23 AM GMT
Ehatv

Ehatv

Next Story