చంద్రబాబు(Chandrababu) కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలను ఆయన తరపు లాయర్లు హైకోర్టుకు సమర్పించారు. చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స జరిగిందని.. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు గుండె పరిమాణం పెరిగిందని.. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలు ఉన్నాయని కోర్టుకు వివరించారు.
చంద్రబాబు(Chandrababu) కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలను ఆయన తరపు లాయర్లు హైకోర్టుకు సమర్పించారు. చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స జరిగిందని.. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు గుండె పరిమాణం పెరిగిందని.. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. చంద్రబాబు తగిన విశ్రాంతి తీసుకోవాలని.. మధుమేహం అదుపులో ఉంచి.. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెప్పారని లాయర్లు కోర్టుకు వివరించారు.
మరో వైపు.. స్కిల్‌స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకి తిరిగి విచారణ చేపట్టనున్నట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. ఇవాళ హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. మరో వైపు చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు.
ఇదిలావుంటే.. 15 రోజుల కిందట రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు కంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత.. ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నెల 28న ఆయన బెయిల్ గడువు ముగియనుంది.