నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జ‌రుగ‌నుంది. అంగల్లు దాడి ఘటనలో ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో చంద్రబాబు ఏ1 గా ఉన్నారు.

నేడు ఏపీ హైకోర్టు(AP Hkigh Court)లో చంద్రబాబు(Chandrababu) బెయిల్ పిటిషన్(Bail Petition) పై విచారణ జ‌రుగ‌నుంది. అంగల్లు దాడి ఘటనలో ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో చంద్రబాబు ఏ1 గా ఉన్నారు. ఈ కేసులో బెయిల్(Bail) ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు(High Court)లో విచారణ జ‌రుగ‌నుంది.

అలాగే.. విజయవాడ(Vijayawada) ఏసీబీ కోర్టుVIjayawada ACB Court)లో చంద్రబాబు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ లపై నేడు విచారణ జ‌రుగ‌నుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు కస్టడీ పిటిషన్ పై నేడు కౌంటర్ వేయనున్నారు. సీఐడీ(CID) కూడా చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కౌంటర్ వేయనుంది. ఇదిలావుంటే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్(Quash Petition)పై విచారణ పూర్తయినా తీర్పు, ఉత్తర్వులు రెండ్రోజుల తర్వాత వెల్లడిస్తామని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఇదిలావుంటే.. చంద్రబాబుపై సీఐడీ మరో పీటీ వారెంట్‌ను దాఖలు చేసింది. ఫైబర్‌నెట్‌(Fiber Net) కుంభకోణంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పీటీ వారెంట్‌ దాఖలు చేయగా, టెరాసాఫ్ట్‌ కంపెనీకి చంద్రబాబు ఫైబర్‌నెట్‌ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అభియోగాలు మోపింది. రూ.115కోట్ల నిధులు గోల్‌మాల్‌ అయ్యాయని సీఐడీ కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ కుంభకోణం(Fiber Net Scam)పై 19 మందిపై సీఐడీ కేసు నమోదయింది.

Updated On 19 Sep 2023 9:23 PM GMT
Yagnik

Yagnik

Next Story