Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) బెయిల్ రద్దు(Bail Cancellation) పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(AP Skill Development Case) లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్(Regular Bail)ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరులో హైకోర్టు(High Court) తన పరిధి దాటిందని తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ(AP CID) నవంబర్ 21న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు తీర్పు తర్వాత.. సాక్ష్యాధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని సీఐడీ అసహనం వ్యక్తం చేసింది. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారని పిటీషన్‌లో పేర్కొంది. హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని.. కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిందన్నారు. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో తేలేంతవరకు.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాల కోరింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ జరపనుంది.