విజ‌య‌వాడ‌లో జ‌రిగిన‌ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌కు ముఖ్యఅతిథిగా హాజ‌రై హైద్రాబాద్ అభివృద్ధిపై ర‌జ‌నీకాంత్‌ చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు స్పందించారు. హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంతో మారింది అని, న్యూ యార్క్ లాగా ఉంది అన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి బాగా చేశారన్నారు. 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ది, తెలంగాణ అభివృద్ధి అందరికీ కనిపిస్తుంది. పక్కరాష్ట్రంలో ఉన్న రజినీకి అర్థమైంది.. కానీ ఇక్కడే ఉన్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేదని ప్ర‌తిప‌క్షాల‌ను ఎద్దేవా చేశారు.

కేసీఆర్ ను దించుతం, బీఆర్ఎస్‌ను దించుతం అంటున్నరు.. కాంగ్రెస్ నాయకులు.. ఎందుకు దించుతరు..? అని ప్ర‌శ్నించారు. ఆసరా పింఛన్లు ఇస్తున్నందుకు దించుతరా..? కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇస్తున్నందుకు దించుతరా..? కేసీఆర్ కిట్ కింద పదమూడు వేలు ఇస్తున్నందుకు దించుతరా..? రైతుబంధు కింద పదివేలు ఇస్తున్నందుకు దించుతరా.? రైతు బీమా కింద ఐదు లక్షలు ఇస్తున్నందుకు దించుతరా.? కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందిస్తున్నందుకు దించుతరా. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా.. టీహాబ్, వీహాబ్, టీఎస్ఐపాస్ తో పదిహేడు లక్షల ప్రైవేటు కొలువులు ఇస్తున్నందుకు దించుతరా.? అని ప్ర‌శ్న‌లు సంధించారు. రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తే, నిరుద్యోగులను రెచ్చ గొట్టే ప్రయత్నం వారు చేస్తున్నారని మండిప‌డ్డారు. దొంగ దీక్షలు చేస్తూ దొంగే దొంగ అన్నట్లు చేస్తున్నారని విమ‌ర్శించారు.

Updated On 29 April 2023 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story