ఏపీ(AP)లో పొత్తుల రాజకీయం( Political Alliance) సాగుతుంది. మొన్నటిదాకా పొత్తులపై ఎవరికి వారు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.. అయితే ప్రస్తుతం ఎవరూ దేని గురించి మాట్లాడటం లేదు.. ఎవరికి వారు కొత్త ప్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే ఏపీలో పొత్తులు అంటే ముందు గుర్తుకువచ్చేది జనసేన(Janasena)-టీడీపీ(TDP). ఈ రెండు పార్టీలకి పొత్తు కుదిరితే అధికారం ఖాయమని చాలామంది భావిస్తారు..

ఏపీ(AP)లో పొత్తుల రాజకీయం(Political Alliance) సాగుతుంది. మొన్నటిదాకా పొత్తులపై ఎవరికి వారు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.. అయితే ప్రస్తుతం ఎవరూ దేని గురించి మాట్లాడటం లేదు.. ఎవరికి వారు కొత్త ప్లాన్స్ వేసుకుంటున్నారు. అయితే ఏపీలో పొత్తులు అంటే ముందు గుర్తుకువచ్చేది జనసేన(Janasena)-టీడీపీ(TDP). ఈ రెండు పార్టీలకి పొత్తు కుదిరితే అధికారం ఖాయమని చాలామంది భావిస్తారు.. గతంతో పోలిస్తే జనసేన గ్రాఫ్ భారీగా పెరిగింది.. ఒక వేళ పొత్తుకు పోకుండా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే అది టీడీపీకి చాలా నష్టం, ఈసారి టీడీపీ గెలవకపోతే ఇంక పార్టీ కనుమరుగవుతుంది చాలామంది భావిస్తున్నారు.. పార్టీని నిలబెట్టుకోవడానికైనా జనసేనతో కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు(Chandrababu)పై ఒత్తిడి పెరుగుతుందని తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్(pawan Kalayan) మాత్రం ఈసారి గెలిచి సీఎం కుర్చీ(CM Seat)లో కూర్చోవాలని చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. చెప్పుకోవడానికి పెద్ద క్యాడర్ లేకపోయినా.. పవన్ ఛరిష్మాతో పార్టీకి ఎంతో కొంత ఓట్లు వస్తాయి.. తాజాగా మాజీ మంత్రి సీనియర్ లీడర్ హరిరామ జోగయ్య(Harirama Jogaiah) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. పవన్ కళ్యాణ్‏ను సీఎం క్యాండెట్ అని ప్రకటిస్తేనే పొత్తు పెట్టుకోవాలని అది కూడా ఐదేళ్లు పవన్ ముఖ్యమంత్రిగా ఉండాలని అప్పుడే ప్రజల సమస్యలను పరిష్కరించగలమని అయన అన్నారు... ఇంతకి పొత్తు కుదిరితే పవన్‏ను ముఖ్యమంత్రిగా బాబు ప్రకటిస్తారా.. ఇది సాధ్యమేనా..?

Updated On 1 April 2023 6:41 AM GMT
Ehatv

Ehatv

Next Story