సంక్రాంతి అంటేనే పల్లె పండుగ, కొత్త పంట ఇంటికి వచ్చిన వేళ ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకునే అచ్చమైన పల్లె పండుగ, ముగ్గులతో, గొబ్బెమ్మలతో అందంగా ముస్తాబయ్యే పల్లెలలో, సూర్యోదయంతోనే హరిలో రంగ హరి అంటూ వచ్చే హరిదాసు ని స్వయంగా విషుమూర్తిగా కొలిచే సంస్కృతి మనది. అలాంటి హరిదాసులు ఈ రోజు అంతరించిపోతున్నారు. అంతరించిపోతున్న హరిదాసు సంస్కృతి పై సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

నుదుటన(Fore head) నిలువు నామాలు రూపం
తలపై అక్షయపాత్రతో(Akshayapatra) దర్శనం
భుజాన మోసే తంబుర సాక్ష్యంగా
చేతిలో మోగే చిడతలు శబ్దం రమణీయంగా..

కాళ్లకు కట్టిన గజ్జలు సవ్వడులుతో
లేత కిరణాలతోడుగా(Sun rays) ‌వెంట నడవగా
ఇంటి ముందర ప్రత్యక్ష దైవంగా వెలసి
హరిలో రంగ హరి అంటూ కీర్తించే..

కీర్తనలు(Keerthanas) ఆలపిస్తూ ధాన్యము స్వీకరిస్తూ
కుటుంబాలను దీవిస్తూ ఊర్లో సందడి చేస్తూ
ధనుర్మాసము మాత్రమే కనిపిస్తూ
పల్లెలలో దర్శనమిస్తూ కనిపించే..

ముగ్గులు(Rangoli) వేసే బ్రహ్మ ముహూర్తములో
ధనధాన్యాలు స్వయం పాకానికి స్వీకరిస్తూ
ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు
కలగాలని ప్రతి ఒక్కరికీ దీవెనలిస్తారు(Blessings)..

ధనిక భేదాలు లేక ఇల్లిల్లు తిరిగేస్తూ
శ్రీమద్రమణ గోవిందా హరి అంటూ
మహావిష్ణువు(Lord Vishnu) రూపములో దర్శనమిస్తూ
అక్షయ పాత్రను సూర్యుని అనుగ్రహంగా స్వీకరించే..

తరగని నిధిగా పాత్రనే భావిస్తూ
కలశాన్ని పవిత్రంగా చూస్తూనే
తిరిగే హరిదాసు(Haridasu) నేడు కనుమరుగయ్యే
కాలానుగుణంగా మాయమైపోయాడు..

వృత్తిని(Proffesion) వదలి ఇతర వృత్తుల్లో స్థిరపడితే
సంస్కృతి సాంప్రదాయలు కళతప్పే
హరిదాసు వేషాలు పాత్రలుగా నిలిచే
సంకురాత్రి సహజత్వం కోల్పోయి సాగే..

Updated On 13 Jan 2024 1:41 AM GMT
Ehatv

Ehatv

Next Story