ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో.. జ‌న‌సేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు

ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో.. జ‌న‌సేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌స‌భ స్థానాల్లోనూ విజ‌యం సాధించి సంచ‌ల‌నం సృష్టించింది. జనసేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ పిఠాపురంలో స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత‌పై 70వేల‌కు పైగా మెజారిటీతో ఘ‌న విజ‌యం సాధించారు. కాపు నేత హ‌రిరామ జోగ‌య్య ఏపీలో కూట‌మి విజ‌యంపై స్పందించారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ కు లేఖ రాశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జ‌న‌సేనానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. రాజ్యాధికారంలో భాగ‌స్వామిగా ధ‌ర్మ పాల‌న‌, నీతివంత‌మైన పాల‌న‌తో ముందుండి న‌డిపించాల‌ని.. ప్ర‌ధానంగా జాతికి మంచి పేరు తీసుకొచ్చేలా పాల‌న కొన‌సాగించాల‌ని ఆకాంక్షించారు.

పవన్ కళ్యాణ్ నాయతక్వంలోని జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. 21 అసెంబ్లీ స్థానాలకు 21.. రెండు ఎంపీ స్థానాలకు రెండు ఎంపీ స్థానాల్లో గెలిచింది.

Updated On 5 Jun 2024 4:30 AM GMT
Yagnik

Yagnik

Next Story