న్యూఢిల్లీలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సీబీసీ) ఛైర్మన్ హన్సరాజ్ అహిర్‌ను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిశారు.

న్యూఢిల్లీ(Delhi)లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC Chairman) ఛైర్మన్ హన్సరాజ్ అహిర్‌(Hansraj Ahir)ను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) కలిశారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోండి కులాలను కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ల(OBC Reservations)కై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఓబీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చడానికి ఎన్‌సిబిసి సిఫార్సు తప్పనిసరి అయిన నేపథ్యంలో.. ఎన్‌సీబీసీ చేసిన ఈ సిఫార్సు చాలా కీలకమైనది.

రాష్ట్రంలో 40 లక్షలకు పైగా వున్న తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సొండి కులాలకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎంపీ జీవీఎల్ నరసింహారావు రెండేళ్లుగా పార్లమెంట్ లోపల, వెలుపల అనేక మార్లు లేవనెత్తారు. ఎంపీ జీవీఎల్ గడిచిన‌ 12 నెలలలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్(Veerendra Kumar), ఎన్‌సీబీసీ వద్దకు ఈ కులాల నేతల ప్రతినిధులను పలుమార్లు తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు చొరవతో సెప్టెంబర్ 13న న్యూఢిల్లీలో ఎన్‌సీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా హియరింగ్ నందు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర అధికారులు, రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎంపీ జీవీఎల్ ప్రయత్నాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్న తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సొండి, అరవ వర్గాలను ఓబీసీల కేంద్ర జాబితాలో చేర్చాలని ఎన్‌సీబీసీ భారత ప్రభుత్వానికి సిఫార్సు పంపింది.

దశాబ్దాల తూర్పు కాపుల సమస్య పరిష్కారం

తుర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ అది కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితమైంది. దీనివలన ఇతర జిల్లాల్లోని తూర్పు కాపులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఈ సిఫార్సు వలన వారికి OBC రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు వర్తించబడతాయి. ఇది తుర్పుకాపుల రిజర్వేషన్ల విషయంలో చారిత్రాత్మకం.

"కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర విద్యాసంస్థల్లో ఈ అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు సాధించడానికి ఎన్‌సీబీసీ యొక్క ఈ సిఫార్సు ఒక పెద్ద ముందడుగు" అని ఎంపి జీవీఎల్ నరసింహారావు సమావేశం అనంతరం తెలియజేశారు. ఈ విష‌యంలో కోరిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సానుకూలంగా వ్యవహరించినందుకుఎన్‌సీబీసీ ఛైర్మన్ హన్స్‌రాజ్ అహిర్‌కు జీవీఎల్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated On 28 Nov 2023 9:54 PM GMT
Yagnik

Yagnik

Next Story