గుంటూరు(Guntur)జిల్లాలో వైసీపీ అధినేత అభ్యర్థులను మార్చిన ఏడు స్థానాల్లో చిలుకలూరి పేట ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, మంత్రి విడుదల రజినిని(Vidudala Rajini) తప్పించి..మల్లెల రాజేష్(Mallela Rajesh) నాయుడుని ఇంచార్జిగా నియమించారు. రజనీకి ఇక్కడ టికెట్ ఇస్తే గెలుపు కష్టమనే అభిప్రాయంతోనే కాపు సామాజికవర్గానికి చెందిన రాజేష్‎కు బాధ్యతలు అప్పగించారు సీఎం జనగ్(CM Jagan). మంత్రి విడుదల రజనీకి ఈ నియోజకవర్గం నేతలైన మర్రి రాజశేఖర్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో విభేదాలు ఉండటంతోనే ఆమెను ఇక్కడి నుంచి గుంటూరు పశ్చిమకు మార్చి..ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

గుంటూరు(Guntur)జిల్లాలో వైసీపీ అధినేత అభ్యర్థులను మార్చిన ఏడు స్థానాల్లో చిలుకలూరి పేట ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, మంత్రి విడుదల రజినిని(Vidadala Rajini) తప్పించి..మల్లెల రాజేష్(Mallela Rajesh) నాయుడుని ఇంచార్జిగా నియమించారు. రజనీకి ఇక్కడ టికెట్ ఇస్తే గెలుపు కష్టమనే అభిప్రాయంతోనే కాపు సామాజికవర్గానికి చెందిన రాజేష్‎కు బాధ్యతలు అప్పగించారు సీఎం జనగ్(CM Jagan). మంత్రి విడుదల రజనీకి ఈ నియోజకవర్గం నేతలైన మర్రి రాజశేఖర్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో విభేదాలు ఉండటంతోనే ఆమెను ఇక్కడి నుంచి గుంటూరు పశ్చిమకు మార్చి..ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

రాజకీయాల్లో ఎంత కష్టపడినా కొందరికి అదృష్టం కలిసి రాదు. కొందరు ఐదారుసార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి కాలేదన్న బాధ చాలా మందిలో ఉంది. అదృష్టం కలిసొచ్చి..తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి(Minister) పదవి దక్కించుకున్న వాళ్లు కొందరే ఉంటారు. అలాంటి వారిలో విడుదల రజనీ ఒకరు. అతి తక్కువ కాలంలో రెండు పార్టీలు మార్చేసిన విడదల రజని చివరకు రెండు ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలను మారాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం చిలకలూరిపేటలో(Chilakaluripeta) వ్యతిరేక గ్రూపులు ఎక్కువ కావడం, అసంతృప్తులు పెరగడంతో ఆమె నియోజకవర్గాన్ని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి రజనీకి టిక్కెట్ ఇస్తే.. గెలుపు కష్టమని ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) టీం సర్వేలలో తేలిందట. దీంతోనే ఆమెను గుంటూరు పశ్చిమకు మార్చి, ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.

అయితే విడుదల ఎమ్మెల్యే అయిన నాటి నుంచే.. మర్రి రాజశేఖర్(Marri Rajasekhar), విడుదల రజనీ మధ్య విభేదాలు ఉన్నాయి. స్థానిక ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులతోనూ సఖ్యత లేకుండాపోయింది. శత్రువు శత్రువు మిత్రుడైనట్టు..లావు, మర్రి.. ఓ వర్గంగా తయారై.. విడదల రజనీకి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపారు. ఆరోగ్యశాఖ మంత్రిగా సోషల్ మీడియాలో(Social media) రజినీకి ఎంత గుర్తింపు వచ్చిందో..సొంత నియోజకవర్గం చిలుకలూరిపేటలో అంతే స్థాయిలో వ్యతిరేకత పెరిగింది. ప్రశాంత్ కిషోర్ టీం నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వడం, సొంత పార్టీ నేతలు వ్యతిరేకిండం వల్లే రజినీని గుంటూరు పశ్చిమకు(Guntur West) మార్చారనేది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అయితే విడుదల రజినీ ఇంఛార్జిగా నియమించడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్(Maddali Giridhara Rao) అనుచరవర్గం స్వాగతించడం లేదు.

ఇక టీడీపీ(TDP) స్ట్రాంగ్‌గా ఉండే నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ సెగ్మెంట్‌ ఒకటి. 2019 సాధారణ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచిన మ‌ద్దాల గిరిధ‌ర్‌రావు వైసీపీకి జైకొట్టారు. ఎమ్మెల్యే పార్టీ మారినా పార్టీ బలం చెక్కు చెదరలేదనే అభిప్రాయం తమ్ముళ్లలో ఉంది. ఇక్కడ పార్టీకి సమర్ధ నాయకత్వం లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌రావు(Alapati) ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇక్క‌డ టీడీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి అవ‌స‌రం కూడా ఉండటంతో చంద్ర‌బాబు(Chandrababu) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని సమాచారం. అదే జరిగితే గుంటూరు పశ్చిమలో ఈసారి టఫ్ ఫైట్ ఉండటం ఖాయం. మరి..ఇన్ని సవాళ్ల మధ్య కొత్తగా ఇంఛార్జి బాధ్యతలు చేపట్టిన మంత్రి విడుదల రజినీ..గుంటూరు పశ్చిమలో ఎంతవరకు నెగ్గుకురాగలుగుతారు? మరో నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Updated On 22 Dec 2023 6:46 AM GMT
Ehatv

Ehatv

Next Story