మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన‌ గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రసాభాస‌గా మారింది. గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన ఈ వేడుక‌లో తొక్కిసలాట జ‌రిగింది.

మ‌హేష్ బాబు(Mahesh Babu) హీరోగా న‌టించిన‌ గుంటూరు కారం(Guntur Karam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(Free Release Event) రసాభాస‌గా మారింది. గుంటూరు(Guntur) జిల్లా నంబూరు(Namburu)లో జరిగిన ఈ వేడుక‌లో తొక్కిసలాట జ‌రిగింది. ఈ తొక్కిసలాటలో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులకు గుర‌య్యారు. 5 వేల మందికి మాత్ర‌మే పాసులు ఏర్పాటు చేయ‌గా.. 15 వేల మందికి మించి అభిమానులు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. దీంతో అభిమానులను చిత్ర యూనిట్‌, పోలీసులు కంట్రోల్ చేయ‌లేక‌పోయారు. అభిమానుల తాకిడి తట్టుకోలేక పోలీసులు లాఠీ ఛార్జీ కూడా చేశారు. నిర్వాహకులు పోలీసుల మద్య కమ్యూనికేషన్ లేకపోవడంతోనే.. ఈ పరిస్థితి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ఉద్రిక్త ప‌రిప్థితుల నేప‌థ్యంలో అభిమానులు తీవ్ర ఇబ్బందులకు గురై కార్యక్రమం నుంచి వెనుదిరిగారు.

Updated On 9 Jan 2024 9:13 PM GMT
Yagnik

Yagnik

Next Story