ఓ వ్యక్తి తాగుడుకు బానిస కావడం.. తాగడానికి డబ్బులు కావాలని భార్యను అడిగితే నిరాకరించడం.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య.. అది విని భార్య ఆత్మహత్య.. కుమారుడిని అనాథను చేసిన దంపతులు. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడలోని(Gudiwada) వాసవినగర్‌లో(Vasavi nagar) విషాదం చోటు చేసుకుంది. వాసవినగర్‌లో కొలుసు రాంబాబు, కనకదుర్గ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ జంటకు గౌతం అనే కుమారుడు కూడా ఉన్నాడు.

ఓ వ్యక్తి తాగుడుకు బానిస కావడం.. తాగడానికి డబ్బులు కావాలని భార్యను అడిగితే నిరాకరించడం.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య.. అది విని భార్య ఆత్మహత్య.. కుమారుడిని అనాథను చేసిన దంపతులు. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడలోని(Gudiwada) వాసవినగర్‌లో(Vasavi nagar) విషాదం చోటు చేసుకుంది. వాసవినగర్‌లో కొలుసు రాంబాబు, కనకదుర్గ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ జంటకు గౌతం అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే రాంబాబు తాగుడుకు బానిసగా మారాడు. దీంతో ఎక్కడా స్థిరంగా ఉద్యోగం చేయడు. పలు ఉద్యోగాలు మారుతూ వచ్చాడు. ఇటీవలే ఏలూరులోని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌గా చేరాడు. ఈ క్రమంలో తన కొడుకు బ్యాంక్‌ ఖాతాలో నాలుగు వేల రూపాయలను రాంబాబు జమ చేశాడు. ఆ తర్వాత వాటిని తిరిగి తీసుకుంటూ వస్తున్నాడు. దాదాపు రెండు వేల రూపాయలను గౌతం నుంచి తీసుకున్నాడు. తాజాగా మరోసారి రూ.500 ఇవ్వాలని భార్యను కోరాడు. తాగుడు కోసం అయితే డబ్బు ఇచ్చేది లేదని భార్య కనకదుర్గ గట్టిగా చెప్పింది. ఇక ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

డబ్బు ఇవ్వకపోగా తనను అగౌరవరపర్చేలా భార్య మాట్లాడిందన్న ఆవేశంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని రాంబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణవార్తను విన్న భార్య కనకదుర్గ తట్టుకోలేకపోయింది. ఆమె కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 500 రూపాయల కోసం గొడవపడి జీవితాలనే వదులుకున్నారని స్థానికులు కలత చెందారు. రాంబాబు, కనకదుర్గ దంపతుల క్షణికావేశం వారి కుమారుడు గౌతంను అనాథను చేసిందని ఆవేదన చెందారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద గౌతం కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Updated On 21 Jan 2024 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story