CM Jagan Tour : గుడివాడ పర్యటనలో సీఎం జగన్‌కు నిరసన సెగ
గుడివాడ(Gudivada) పర్యటనలో సీఎం జగన్‌కు(CM jagan) నిరసన సెగ తగిలింది. టిడ్కో ఇళ్ల పంపిణీకి శుక్రవారం గుడివాడ వెళ్లిన సీఎం జగన్ రాకను వ్యతిరేకిస్తూ.. హెలిపాడ్ వద్ద టీడీపీకి(TDP) చెందిన మహిళా కార్యకర్తలు నిరసన వ్యక్తంచేశారు. గో బ్యాక్ సైకో సీఎం(Go Back Psyco CM)..

CM Jagan Tour
గుడివాడ(Gudivada) పర్యటనలో సీఎం జగన్‌కు(CM jagan) నిరసన సెగ తగిలింది. టిడ్కో ఇళ్ల పంపిణీకి శుక్రవారం గుడివాడ వెళ్లిన సీఎం జగన్ రాకను వ్యతిరేకిస్తూ.. హెలిపాడ్ వద్ద టీడీపీకి(TDP) చెందిన మహిళా కార్యకర్తలు నిరసన వ్యక్తంచేశారు. గో బ్యాక్ సైకో సీఎం(Go Back Psyco CM).. అంటూ నల్ల బెలూన్లను(Black Baloons) గాల్లోకి వదిలారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల వలయాన్ని చేధించుకుని మరీ.. సభా ప్రాంగణానికి దగ్గరే ఉన్న హెలిపాడ్ వద్ద నిరసనకు దిగారు.
