ఖండకావరంతో ఒక సామాజిక వర్గం మంత్రి అంబటి రాంబాబుపై(Ambati rambabu) ఖమ్మంలో దాడికి ప్రయత్నించటం సిగ్గుచేటని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మండిపడ్డారు. మా సామాజిక వర్గంలో ఎవరూ లేరు అనుకుంటున్నారా.?

ఖండకావరంతో ఒక సామాజిక వర్గం మంత్రి అంబటి రాంబాబుపై(Ambati rambabu) ఖమ్మంలో దాడికి ప్రయత్నించటం సిగ్గుచేటని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) మండిపడ్డారు. మా సామాజిక వర్గంలో ఎవరూ లేరు అనుకుంటున్నారా.? లేక మేము చూస్తూ ఊరుకుంటామని భ్రమలో ఉన్నారా.? భౌతికంగా అంబటి రాంబాబును ఎలిమినేట్ చేస్తే రూ. 50 లక్షల రివార్డు ప్రకటించడం ఆ సామాజిక వర్గం దుశ్చర్యకు మరో ఉదాహరణ కాదా.? అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు.

గుంటూరులోని(Guntur) మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్దకు చేరుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(MLC Lella Appi Reddy), డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Varaprasad), చీఫ్ విప్ డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(Dr.Uma Reddy Venkateswarulu), కాపు కార్పొరేషన్ అధ్యక్షులు అడపా శేషు తదితరులు.. మంత్రి అంబటి రాంబాబుకు అండగా ఉన్నామని, ఉంటామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. కాపు నాయకత్వంపై ఆ సామాజిక వర్గం దాడులకు తెగబడుతూనే ఉంది. నాడు కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగా(Vangaviti Mohan Reddy) హత్య కూడా ఇదే కోవకు చెందుతుందంటూ నిప్పులు చెరిగారు. మా పార్టీ నిర్ణయాలను, విధానాలను ప్రజల ముందుకు తీసుకువెళుతున్న అంబటి రాంబాబుపై దాడి చేయాలని ప్రయత్నించటం, వ్యక్తిగతంగా దుర్భాషలాడటం ఏమిటని ప్ర‌శ్నించారు. ఇలాంటి చర్యలకు తెగబడితే మా సామాజిక వర్గం చూస్తూ ఊరుకోదని అన్నారు.

విధానాలు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని పరుష పదజాలంతో మాట్లాడని వ్యక్తి అంబటి రాంబాబు అని, అలాంటి వ్యక్తి మీద దాడులకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మేమంతా ఒకసారి రోడ్లమీదకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా.? అంటూ నినదించారు. పక్క రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దాడులకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తున్నమన్నారు.

రాష్ట్రంలో గతంలో ముద్రగడ పద్మనాభం మీద కూడా వేధింపులు, దాడులకు పాల్పడిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ నోరు విప్పలేదని, ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన మీద కూడా ఖచ్చితంగా నోరు విప్పరని అన్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారం ప్రజలు, సామాజిక వర్గం గమనిస్తూనే ఉంటుందన్నారు. గ్రామస్థాయి నుండి కాపులకు రాజ్యాధికారం కల్పిస్తూ.. మంత్రివర్గంలో సైతం ఐదుగురికి స్థానం కల్పించిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు.

Updated On 30 Oct 2023 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story