ఇంతకు ముందు అనకాపల్లి వైసీపీ ఇంఛార్జిగా భరత్‌ను నియమించటంతో.. గుడివాడ అమర్నాథ్‌కి టికెట్ కష్టమనే వార్తలు

వైఎస్సార్‌సీపీ 12వ జాబితాను విడుదల అయ్యింది. రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట(అసెంబ్లీ) సమన్వయకర్తగా కావటి మనోహర్‌నాయుడు, గాజువాక(అసెంబ్లీ) సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. ర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. బీవీ రామయ్యను కర్నూలు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించడంతో కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను నియమిస్తూ.. ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా విడదల రజనీ ఉంది. ఇంఛార్జి బాధ్యతలను ఇటీవలే మల్లెల రాజేష్ నాయుడుకు ఇచ్చారు. తాజాగా ఆయన్ని తొలగించి కావటి మనోహర్ నాయుడులను వైసీపీ అధిష్టానం నియమించింది.

"సీఎం @ysjagan గారి ఆదేశాల మేరకు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యం చిలకలూరిపేట అసెంబ్లీ సమన్వయకర్త గా కావటి మనోహర్ నాయుడు, గాజువాక అసెంబ్లీ సమన్వయకర్త గా గుడివాడ అమర్నాథ్ ను లేఖను విడుదల చేసింది." అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇంతకు ముందు అనకాపల్లి వైసీపీ ఇంఛార్జిగా భరత్‌ను నియమించటంతో.. గుడివాడ అమర్నాథ్‌కి టికెట్ కష్టమనే వార్తలు వచ్చాయి. అయితే సీఎం జగన్ ఇటీవల విశాఖకు వెళ్లినప్పుడు గుడివాడ అమర్‌నాథ్ బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఇప్పుడు గాజువాక వైసీపీ ఇంఛార్జిగా గుడివాడ అమర్‌నాథ్‌ను జగన్ నియమించారు.

Updated On 12 March 2024 9:58 PM GMT
Yagnik

Yagnik

Next Story