ఏపీ నుండి వెళ్ళిన ట్యాక్స్ లనే కేంద్రం ఇస్తోంది తప్ప అక్కడి నిధులు మాత్రం కాదని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు 70 శాతం పోలవరం కట్టలేదు.. 70 శాతం కొట్టేశారని అన్నారు.

ఏపీ(AP) నుండి వెళ్ళిన ట్యాక్స్ లనే కేంద్రం(Central Govt) ఇస్తోంది తప్ప అక్కడి నిధులు మాత్రం కాదని మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) అన్నారు. ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు 70 శాతం పోలవరం కట్టలేదు.. 70 శాతం కొట్టేశారని అన్నారు. కట్టప్ప మనోహర్ ( Nadendla Manohar) ఏదో ఒక సంస్థకి ఉచితంగా భూములు ఇచ్చేస్తున్నారు అని ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నార‌ని అన్నారు. చంద్రబాబు నాయుడు(Chandrababu) ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం, వెన్ను పోటు పొడవడం త‌ప్ప ఏం లేద‌న్నారు. పెద కట్టప్ప, చిన్న కట్టప్ప తండ్రి కొడుకులన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌(NTR)ను తండ్రి, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను కొడుకు వెన్ను పోటు పొడిచార‌ని అన్నారు. స్కూల్ బ్యాగ్ లు, పరిశ్రమలు గురించి తప్పుగా మాట్లాడి ప్రజలను తప్పుద్రోవ‌ పట్టించవద్ద‌న్నారు.

తెలంగాణ(Telangana) ఎన్నికలతో మాకేంటి సంబంధం అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయ‌న్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 2022-23కి జీఎస్డీపీ గ్రోత్ రేటు 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో వున్నామన్నారు. ఆంధ్ర‌ప్రదేశ్ తలసరి ఆదాయం 2019కి ముందు 17వ స్థానంలో వుంటే ఇప్పుడు 9వ స్థానంలో వుందన్నారు.

పారిశ్రామిక అభివృద్ధి పరంగా యువతకి వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పన జ‌రిగింద‌న్నారు. భారీ పరిశ్రమలు సెక్టార్‌లో, చిన్న తరహా పరిశ్రమలలో 13 లక్షల మందికి ఉపాధి ల‌భించ‌ద‌న్నారు. వ్యవసాయంలో 2019లో 27 వ స్థానంలో ఉండ‌గా.. ఇప్పుడు 6వ స్థానంలో వున్నామని వివ‌రించారు. పరిశ్రమలు వృద్ధి 2019లో 22వ స్థానంలో ఉండ‌గా.. ఇప్పుడు 2022 వరకూ ఉన్న‌ రిపోర్ట్ ప్రకారం 3వ స్థానంలో వుందని వెల్ల‌డించారు. గుజరాత్ తర్వాత ఏపీకే అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. బిజినెస్ రిసోర్స్ యాక్షన్ ప్లాన్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ల‌లో 350 అంశాలు పరిగణనలోకి తీసుకుని ఇచ్చిన ర్యాంకు ప్ర‌కారం.. నెంబర్ వన్ స్థానంలో వున్నామని వివ‌రించారు.

ఏపీని పారిశ్రామిక హబ్ గా తయారు చేశామ‌ని పేర్కొన్నారు. ఏసీ సంస్థలు అన్నీ కూడా ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారని వెల్ల‌డించారు. గ్లోబల్ సమ్మిట్ లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు. గడిచిన కేబినెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆచరణలోకి వచ్చాయని వెల్ల‌డించారు.

పోర్ట్ లు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామ‌ని వివ‌రించారు. ఫిషింగ్ హార్బర్ లు, ఫిష్ ల్యాండింగ్ నిర్మాణం, ప్రతి యాభై కిలో మీటర్లకు ఒక యాక్టవిటీ వుండాలి అనే ఆలోచనతో నిర్మాణం చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 11 ఇండస్ట్రీ కారిడార్‌లకి గానూ 3 ఏపీలో వున్నయన్నారు. 5500 ఎకరాల అచ్యుత పురం, నక్కపల్లిలో అతి పెద్ద కారిడార్ నిర్మాణం, 640 కిమి విస్తీర్ణంలో పీసీపీఐఆర్ రీజియన్ ఉన్న‌ట్లు వివ‌రించారు. టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న 2,950 కోట్ల రూపాయల పరిశ్రమల రాయితీలు చెల్లించామ‌ని.. ఇంకా ఇవ్వవలసినవి ఇస్తామ‌ని పేర్కొన్నారు.

Updated On 16 Nov 2023 12:41 AM GMT
Yagnik

Yagnik

Next Story