ప్రజల పక్షాన పోరాడటానికి మేం ఎప్పుడూ సిద్ధమేనని

ప్రజల పక్షాన పోరాడటానికి మేం ఎప్పుడూ సిద్ధమేనని గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని అన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయని.. వీటిపై కొత్త ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. ఈ దాడులు ప్రజాస్వామ్యం కాదని.. గెలిచిన వారు బలవంతులు కాదు.. ఓడిన వారు బలహీనులు కాదన్నారు.

విశాఖలో పుట్టిన వ్యక్తిగా మేం ప్రజలకు అండగా ఉంటాం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా పని చేస్తామని కూటమి ప్రభుత్వానికి సమయమిస్తామన్నారు గుడివాడ అమర్ నాథ్. ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సీఎం జగన్‌ ఎప్పుడూ అందరిని సమానంగా చూడాలన్న భావంతో పని చేశారన్నారు అమర్‌నాథ్‌. గాజువాక అభివృద్ధి కోసం గెలిచిన అభ్యర్థికి సహకరిస్తానని.. రామయ్య పట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టు పనులు అఖరి దశకు వచ్చాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ఈ కొత్త ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందన్నారు. ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పని చేయాలన్నారు.

Updated On 6 Jun 2024 2:48 AM GMT
Yagnik

Yagnik

Next Story