Gujarat Titans: ఐపీఎల్ నుండి గుజరాత్ టైటాన్స్ అవుట్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మ్యాచ్ టాస్ కూడా పడకుండా రద్దయింది. దీంతో ఇరుజట్లకూ చెరో పాయింట్ లభించింది. కేకేఆర్ టేబుల్ టాప్‌ప్లేస్‌కు చేరుకుంది. గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం జీటీకి 11 పాయింట్లు ఉన్నాయి. తర్వాతి మ్యాచ్ సన్‌రైజర్స్‌తో గెలిచినా 13 పాయింట్లే అవుతాయి. దీంతో గుజరాత్ టైటాన్స్ అధికారికంగా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.
ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన కేకేఆర్ 19 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది. దీంతో క్వాలిఫైయర్-1లో కేకేఆర్ పోటీ పడనుంది. పదేళ్ల తర్వాత కేకేఆర్ క్వాలిఫైయర్-1 ఆడబోతోంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 12 మ్యాచులాడిన ఆర్ఆర్ 16 పాయింట్లు సాధించింది. తన తర్వాతి రెండు మ్యాచుల్లో ఒకటి గెలిచినా ప్లే ఆఫ్స్ చేరుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 13 మ్యాచుల్లో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) 12 మ్యాచుల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి నాలుగో ప్లేస్‌లో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచుల్లో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.