పెళ్లి సందడితో చర్చి(Church) కళకళలాడుతోంది. వధూవరుల బంధు మిత్రులంతా శుభగడియ కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్న ఆ జంటను చూసి ముచ్చటపడిపోతున్నారు.

పెళ్లి సందడితో చర్చి(Church) కళకళలాడుతోంది. వధూవరుల బంధు మిత్రులంతా శుభగడియ కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్న ఆ జంటను చూసి ముచ్చటపడిపోతున్నారు. అప్పటికే పాస్టర్లు ప్రార్థనలు చేశారు. క్రీస్తు దీవెనలు అందించారు. కొత్త జంట కలకాలం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. ఇక పెళ్లికొడుకు, పెళ్లి కూతురు(Bride) ఉంగరాలు మార్చుకోవడమే మిగిలింది. ఆ క్షణం కూడా రానే వచ్చింది. అంతలోనే ఇరు కుటుంబసభ్యులలో చిన్నపాటి కలవరం.

బాత్‌రూమ్‌కు అని చెప్పి వెళ్లిన పెళ్లి కొడుకు(Groom) పది నిమిషాలైనా రాకపోయేసరికి ఆందోళన అధికమయ్యింది. బాత్‌రూమ్‌ దగ్గరకు వెళ్లి తలుపు కొట్టి చూశారు.. ఊహూ.. లాభం లేకపోయింది. తలుపులు ఎంత బాదినా వరుడి నుంచి జవాబు లేదు. చివరకు అందరూ కలిసి పెళ్లికొడుకును బతిమాలారు. చివరకు తలుపు తీసి బయటకు వచ్చాడా వరుడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ పెద్ద బాంబు పేల్చాడు. కారణం అడిగితే ఏవో సాకులు చెప్పసాగాడు. వరుడి ప్రవర్తన అక్కడున్న చాలా మందికి నచ్చలేదు.

పెళ్లి పెద్దలకైతే కోపం వచ్చింది. పరిస్థితి చూస్తే అందరూ కలిసి తనను చితకబాదుతారేమోనన్న అనుమానం వరుడికి కలిగింది. భయంతో డయల్‌ 100కు ఫోన్‌ చేశాడు. దాంతో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసుస్టేషన్‌కు పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో పాటు ఇరువర్గాలకు చెదిన బంధువులను పిలిపించారు. వధూవరులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పెళ్లికూతురు, ఆమె తరపు బంధువులు పెళ్లికి నిరాకరించారు. వరుడు తీరు వారిని బాధించింది. కోపం తెప్పించింది. చివరకు పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ వివాహం రద్దయింది.

ఈ విచిత్ర సంఘటన విశాఖపట్నం(Vizag) పాత గోపాలపట్నంలోని(Patha Gopalapatanam) ఓ చర్చిలో జరిగింది. నగరానికి చెందిన అమ్మాయికి, పాత గోపాలపట్నంకు చెందిన అబ్బాయికి మూడు నెలల కిందట పెళ్లి సంబంధం కుదిరింది. కట్నం కింద మూడు లక్షల రూపాయలు, లాంఛనంగా 15 గ్రాముల బంగారు గొలుసు, ద్విచక్రవాహనం(Vehicle) ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తరఫు వారు అంగీకరించారు.పెళ్లి సంబంధం కుదిర్చిన తర్వాత ఫోన్‌లో అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదన్న కారణంతో పెళ్లి వద్దన్నాడట వరుడు. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమమని పెళ్లికి వచ్చిన చాలా మంది కామెంట్‌ చేశారు.

Updated On 26 Oct 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story